మోదీ నోట `ముస్లిం రిజర్వేషన్` మాట
ఒకవైపు తొలివిడత ఎన్నికల పోలింగ్.. మరోవైపు రెండో విడత ప్రచారం గుజరాత్ రాష్ట్రంలో వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.
లునవాడ: ఒకవైపు తొలివిడత ఎన్నికల పోలింగ్.. మరోవైపు రెండో విడత ప్రచారం గుజరాత్ రాష్ట్రంలో వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందని మోదీ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో కాంగ్రెస్ యువ నాయకుడు సల్మాన్ నిజామి చేసిన ట్వీట్లపై విమర్శలు చేశారు. "గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ తరుఫున నిజామి ప్రచారం చేసారు. ట్విట్టర్ లో ఆయన రాహుల్ తండ్రి, నానమ్మ గురించి రాసాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. మోదీ నీ తల్లితండ్రులెవరో చెప్పండి?' అని నన్ను ప్రశ్నించారు. ఇటువంటి మాటలను కనీసం శత్రువులు కూడా ఉపయోగించరు" అని అన్నారు. నిజామి కాశ్మీరులకు మద్దతు పలికారు. మన దేశ సైన్యాన్ని పరుషపదజాలంతో పోల్చాడు. ఇలాంటి వ్యక్తుల్నా.. ప్రజలు అంగీకరించేది. ప్రతి ఇంట్లో అఫ్జల్ గురు ఉంటారని నిజామి గతంలో చెప్పిన వివాదాస్పద వ్యాఖ్యలను మోదీ గుర్తుచేశారు.