Gujarat Elections 2022: దేశమంతా ఇప్పుడు గుజరాత్ ఎన్నికలవైపే దృష్టి సారించింది. అందర్నీ ఆకర్షిస్తున్న గుజరాత్ తొలిదశ పోలింగ్ రేపు అంటే డిసెంబర్ 1న జరగనుంది. తొలిదశలో రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా..తొలిదశ పోలింగ్ రేపు డిసెంబర్ 1న జరగనుంది. తొలిదశలో పోలింగ్ జరగనున్న 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.


దేశంలో అందరి దృష్టీ ఇప్పుడు గుజరాత్ ఎన్నికలపైనే ఉంది. గుజరాత్‌లో అధికార బీజేపీ , ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో పాటు ఈసారి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా బరిలో దిగింది. అంతేకాదు..భారీ ప్రచారం, పెద్దఎత్తున హామీలతో కాంగ్రెస్, బీజేపీలకు సమ ఉజ్జీగా నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలిదశ పోలింగ్ రేపు డిసెంబర్ 1న ఉదయం 8 గంటలకు ప్రారంభమై..సాయంత్రం 5.30 వరకూ జరగనుంది. తొలిదశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


తొలిదశలో పోలింగ్ జరిగే 89 అసెంబ్లీ స్థానాలకు 788 అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో 70 మంది మహిళలైతే, 339 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులున్నారు. తొలిదశ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుజరాత్ తొలిదశ ఎన్నికల్లో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలున్నాయి.


గుజరాత్ గత ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య సాగింది. ఓ దశలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందా అన్పించేంతగా కౌంటింగ్ సరళి సాగింది. ఈసారి మాత్రం ఈ రెండు పార్టీలకు తోడుగా ఆప్ సర్వశక్తులూ ఒడ్జుతోంది. మూడు పార్టీల మధ్య నువ్వా నేనా చందంలో ప్రచారం సాగింది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యోగి తదితరులు ప్రచారం చేయగా..కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితరులు ప్రచారం కొనసాగించారు. 


రెండవ దశ పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన 93 స్థానాల్లో జరగనుంది. గుజరాత్‌లో ఈసారి వరుసగా నాలుగోసారి ప్రజలు బీజేపీకు పట్టం కడతారా లేదా కాంగ్రెస్, ఆప్ వైపుకు మొగ్గు చూపుతారా అనేది చూడాల్సి ఉంది. 


Also read: Unfollow Ndtv: ఎన్డీటీవీలో కీలక పరిణామాలు, ట్రెండింగ్‌లో అన్‌ఫాలో ఎన్డీటీవీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook