Former CM Keshubhai Patel tested Covid-19 positive: న్యూఢిల్లీ: దేశలో కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, అగ్ర నాయకులు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గుజరాత్‌ (Gujarat ) మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్‌ (Keshubhai Patel) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం కేశుభాయ్ పటేల్ గాంధీనగర్‌లోని నివాసంలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి కారోనా లక్షణాలు లేవని పేర్కొన్నారు.  Also read: Agricultue Bills: 25న భారత్ బంద్!.. మూడు రోజులపాటు రైల్‌రోకోకు పిలుపు


ఇదిలాఉంటే.. మొదట ఆయన వ్యక్తిగత సిబ్బందికొకరికి కరోనా సోకిందని, ఆ తర్వాత కేశుభాయ్‌కు కరోనా పరీక్షలు చేయించినట్లు సమాచారం. 92ఏళ్ల కేశుభాయ్‌కు గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ సైతం జరిగింది. ఆయనకు కరోనా సోకిందన్న విషయం తెలియగానే.. కేశుభాయ్‌ ఆరోగ్యం గురించి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన కేశుభాయ్ కుమారుడితో ఫోన్‌లో సంభాషించారు. అంతేకాకుండా వైద్యులు అప్రమత్తంగా ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని సీఎం పలు సూచనలు సైతం చేశారు. Also read: Dubai: ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం