Woman thrashed by in-laws: మధ్యాహ్నం కునుకు తీసిందని దారుణంగా కొట్టిన భర్త, అత్తమామలు
In-laws beat woman over afternoon rest : అలా కునుకు తీసిందనే కోపంతో 24 ఏళ్ల వివాహితను ఆమె అత్తగారింటి వారు దారుణంగా కొట్టారు. భర్త, అత్తమామలు తీవ్రంగా వేధించారు. ఈ ఘటన గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Gujarat woman thrashed by Husband in-laws for taking afternoon nap: ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసే ఆడవారికి అప్పుడప్పుడు కాస్త అలసటగా అనిపిస్తుంటుంది. దాంతో కాస్త రెస్ట్ తీసుకుందామనుకుంటారు. అలా అలసిపోయిన వారు మధ్యాహ్నం పూట కాసేపు కునుకు (afternoon nap) తీస్తుంటారు. ఇది సాధారణ విషయమే. కానీ అలా కునుకు తీసిందనే కోపంతో 24 ఏళ్ల వివాహితను ఆమె అత్తగారింటి వారు దారుణంగా కొట్టారు. భర్త, అత్తమామలు తీవ్రంగా వేధించారు. ఈ ఘటన గుజరాత్ (Gujarat) లోని మెహ్సానా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుజరాత్‌లోని మెహ్సానా (Mehsana) జిల్లా కాదీకి (Kadi) చెందిన వ్యక్తిని 2016లో చేసుకున్న ఆ బాధితురాలికి పెళ్లి నాటి నుంచే మెట్టినింట వేధింపులు మొదలయ్యాయి. తన అత్తగారింట్లో మొదటి నుంచీ మధ్యాహ్నం సమయంలో కాసేపు నిద్ర (Sleep) పోవడాన్ని వ్యతిరేకించేవారని బాధితురాలు పేర్కొన్నారు. అయితే తాను తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేయడంతో.. అలసట వల్ల మధ్యాహ్నం సమయంలో కాసేపు నిద్రపోవాల్సి వచ్చేదని ఆమె పేర్కొన్నారు. కానీ తన మెట్టినింటి వారు అర్థం చేసుకోకుండా హింసిస్తున్నారని బాధితురాలు ఆవేదన చెందారు.
ఇక గతంలో కూడా ఈ విషయంలో తన మెట్టినింటి వారు తీవ్రంగా కొడితే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఆ తర్వాత పెద్దలు (community leaders) రాజీ చేయడంతో బాధితురాలు సర్దుకుపోయారు. కానీ తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో కూడా తన భర్త, అత్తమామలు (husband and in-laws) ఎలాంటి సాయం చేయలేదని బాధితురాలు పేర్కొన్నారు. 2017 సెప్టెంబర్ 18న తనకు కూతురు పుట్టిందని.. ఆ తర్వాత మెట్టినింటి నుంచి వేధింపులు మరింత పెరిగాయని ఆమె పేర్కొన్నారు.
Also Read : Viral Video: ప్రపంచం మంటలో కలిసిన సరే.. మాకు భోజనమే ముఖ్యం! నెటిజన్లు సీరియస్
కొడుకు పుట్టలేదనే నెపంతో తన భర్త, అత్తమామలు తీవ్రంగా కొడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 7న (February 7) భర్త తనను వదిలేశాడని.. ఆ సమయంలో కుల పెద్దలు జోక్యం చేసుకున్నా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు (police) ఫిర్యాదు ఆమె భర్త, అత్తమామలపై గృహహింస కేసు (Case) నమోదైంది. కేసు దర్యాప్తులో ఉంది.
Also Read : Pakistani Model Photoshoot: కర్తార్ పూర్ గురుద్వారా ఎదుట ఫొటోషూట్.. వివాదంలో పాకిస్తానీ మోడల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook