Gyanvapi Masjid: దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సర్వే పనులు, నివేదికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోంది. మసీదు ఆవరణలో శివలింగం బయటపడిందని ఓ వర్గం చెబుతోంది. ఈమేరకు కోర్టు సైతం పిటిషన్‌ వేశారు. 12 అడుగుల ఎత్తుతో నంది ముఖంతో శివలింగం ఉందని అంటున్నారు. శివలింగం ఉందన్న ప్రకటనను మరో వర్గం ఖండించింది. మసీదు ప్రాంగంణంలో ఏముందన్న దానిపై న్యాయవాదులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో తక్షణం మసీదు ప్రాంగణాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్వే వీడియోలను సైతం బయటకు పెట్టొద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీడియో సర్వే వివరాలను అధికారులు..కోర్టుకు సమర్పించనున్నారు. ఈక్రమంలోనే సర్వేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఓ వర్గం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.  జ్ఞానవాపి మసీదు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయన్న వాదన తెరపైకి వస్తోంది. ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని పడగొట్టి..జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఓ వర్గం చెబుతోంది. అక్కడ ఆనవాళ్లు సైతం ఉన్నాయని అంటున్నారు.


అదే సమయంలో తాజ్‌ మహల్‌పై వివాదం నడుస్తోంది. తాజ్‌ మహల్‌ను శివ మందిర్ తేజో మహాలయగా కొందరు పిలుస్తున్నారు. అక్కడ పూర్వం శివాలయం ఉందని గుర్తు చేస్తున్నారు. కానీ చరిత్రలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. తాజ్ మహల్ హిందూ దేవాలయం అనడానికి అనేక ఆధారాలున్నాయని చెబుతున్నారు. తాజ్‌ మహల్ పైభాగంలో ఉన్న నిర్మాణాలే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఏ ఆలయ నిర్మాణం జరిగినా..గుడిపై భాగంలో కలశం ఉంటుందని కొందరు స్పష్టం చేస్తున్నారు. మొఘుల కాలంలో అనేక దేవాలయాలు కూల్చివేయబడ్డాయని అంటున్నారు.


అయోధ్య, కాశీ,మధురపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. మధురలోని ఈద్గా మసీదులో సర్వే, వీడియోగ్రఫీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈద్గా ..కృష్ణుడి జన్మభూమికి ఆనుకుని ఉందని..ఆలయాన్ని కూల్చివేసి..మసీదు నిర్మించారని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కమల్ మౌలా మసీదు ప్రాంతంలో గతంలో పురాతన ఆలయం ఉండేదని చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోని జామా మసీదు, జౌన్‌పూర్‌లోని అటాలా మసీదు సైతం వివాదాల్లో చిక్కుకున్నాయి.


Also read: India-China Border: దేనికైనా రెడీ..చైనాకు ధీటుగా భారత్ సమాధానం..!


Also read: TDP Mahanadu: మహానాడుతో టీడీపీలో జోష్‌ వస్తుందా..చంద్రబాబు ఏమంటున్నారు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook