Gyanvapi masjid Report: జ్ఞానవాపి మసీదు నివేదిక లీకయిందా..మసీదులో త్రిశూలం, కమలం, కలశ చిహ్నాలా ?
Gyanvapi masjid Report: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారణాసి కోర్టుకు సర్వే కమిటీ సమర్పించిన నివేదికలో హిందూత్వ చిహ్నాల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది.
Gyanvapi masjid Report: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారణాసి కోర్టుకు సర్వే కమిటీ సమర్పించిన నివేదికలో హిందూత్వ చిహ్నాల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వే, వీడియోగ్రఫీ నివేదిక కోర్టులో గురువారం సమర్పించారు. ఈ నివేదికలోని కొన్ని అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. జ్ఞానవాపి మసీదులోపలి భాగంలో త్రిశూలం, కమలం, కలశం గుర్తులతో పాటు 2.5 అడుగుల పొడవైన కట్టడం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన నివేదిక పిటీషనర్ న్యాయవాదులకు చేరింది. కానీ ఆ న్యాయవాదులకు నిజంగా నివేదిక కాపీ చేరిందా లేదా అనేది నిర్ధారణ కాలేదు. నివేదికలో ఉన్న అంశాలంటూ కొన్ని కీలక విషయాలు లీకయ్యాయి.
1. న్యాయవాదులు షేర్ చేసిన నివేదిక ప్రకారం మసీదులో త్రిశూలం, కమలం, కొన్ని ప్రాచీన శిల్పాలు, మసీదు ప్రాంగణంలో, గోడపై దేవతా విగ్రహాల చిహ్నాలు ఉన్నాయి. మసీదులో శివలింగం కూడా ఉన్నట్టుగా కొంతమంది హిందూవులు గతంలో క్లెయిమ్ చేశారు.
2. ఈ నివేదిక ప్రాకరం కమలం, కలశం మార్కులు మసీదు బేస్‌మెంట్ పిల్లర్లపై ముద్రించి ఉన్నాయి. ప్రాచీన హిందీ భాషలో కొన్ని పదాలు కూడా పిల్లర్లపై ఉన్నాయి. గోడలపై త్రిశూలం చిహ్నాలున్నాయి. మసీదు పశ్చిమ భాగంలో రెండు పెద్ద పిల్లర్లు, ఒక ఆర్చ్ కన్పించాయి. ఇవి ప్రాచీన ఆలయానికి సంబంధించినవిగా చెబుతున్నారు.
3. నివేదికలో మసీదు మూడవ డోమ్ కింది భాగంలో ఓ రాయిపై లోటస్ మార్క్ చెక్కి ఉంది. రెండున్నర అడుగుల పొడవైన ఓ కట్టడం మసీదు ప్రాంగణంలో ఉంది. దీనినే శివలింగం అని హిందూవులు చెబుతున్నారు.
4. జ్ఞానవాపి మసీదు తరపు నుంచి మాత్రం ఈ నివేదికపై ఏ విధమైన వ్యాఖ్యలు రాలేదు. అయితే కోర్టు చూడకుండానే నివేదిక బయటకు ఎలా వస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also read: Supreme Court:దిశా కేసును ప్రత్యేకంగా మానిటర్ చేయలేదు..సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook