Gyanvapi Masjid: దేశంలో ప్రస్తుతం జ్ఞాన్‌వాపి మసీదు వివాదం ప్రకంపనలు రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగులోనికి వస్తోంది. మసీదు ప్రాంగణంలో శివలింగ కనిపించడంతో స్థానిక భక్తులు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. జ్ఞాన్‌వాపి మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నాయని, మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నాయని సర్వే కమిటీ నిర్ధారించింది. త్రిశూలం, శేషనాగు పడగ, ఢమరుకం, గోడలపై కమలం గుర్తులు, హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు కనిపించినట్లు కమిటీ కోర్టుకు నివేదిక ఇచ్చింది. సర్వే నివేదిక లీక్ కావడం దేశంలో సంచనంగా మారింది. తాజాగా మరిన్ని సంచలన అంశాలు వెలుగులోనికి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో బాబా మాత్రమే కాదు శివుని 11వ రుద్రావతారం హనుమంతుడు కూడా ఉన్నట్లు తేలింది. వారణాసి జ్ఞాన్‌వాపీ అంశంపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో.. జీ న్యూస్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. జీ న్యూస్‌ అన్వేషణలో మసీదు ప్రాంగణంలో హనుమంతుడి విగ్రహానికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. తాజా ఘటనతో మసీదు ప్రాంతంలో గతంలో శివాలయం ఉండేదన్న హిందూవాదుల వాదనకు బలం చేకూరుస్తోంది.


జ్ఞాన్‌వాపిలో హనుమాన్ జీ విరాజ్‌మాన్..


వారణాసిలోని బాబా కాశీ విశ్వనాథ దేవాలయంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జ్ఞానవాపి కేసులో జీ న్యూస్ ప్రత్యేక రిపోర్టింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా జ్ఞానవాపి మసీదు భూమికి సంబంధించిన  154 ఏళ్ల అరుదైన చిత్రాన్ని జీన్యూస్ ప్రతినిధులు కనుగొన్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం చాలా విషయాలను వెల్లడిస్తోంది. ఈ చిత్రాన్ని బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ శామ్యూల్ బోర్న్ 1868లో తీశారు. ఈ చిత్రంలో జ్ఞానవాపి ప్రాంగణంలో శివుడి ప్రధాన సేవకులు నంది, హనుమంతుని విగ్రహంతో పాటు ప్రాంగణంలోని స్తంభాలపై హిందూ కళాఖండాలు మరియు గంటలు కనిపిస్తున్నాయి. అంటే, శివుని 11వ రుద్రావతారం హనుమంతుడు కూడా జ్ఞానవాపిలో కొలువైనట్లు ఈ చిత్రం ద్వారా స్పష్టమవుతుంది. హిందువుల వాదనలను బలపరిచే ఈ చిత్రం USAలోని హ్యూస్టన్‌లోని 'ది మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్'లో భద్రపరచబడి ఉంది. జీ న్యూస్ వెలికి తీసిన ఈ చిత్రం.. జ్ఞాన్ వాపి మసీదు భూమిపై ఎవరికి హక్కు ఉందో నిర్ధారించడానికి కోర్టుకు బలమైన సాక్ష్యంగా ఉంటుందని హిందూసంఘాలు చెబుతున్నాయి. 


READ ALSO: AP CRISIS: ఓవర్ డ్రాఫ్ట్ లో ఏపీ టాప్.. తెలంగాణ సెకండ్! శ్రీలంక పరిస్థితులు రాబోతున్నాయా?


READ ALSO: KCR Tour: అఖిలేష్ మౌనం.. పాలిటిక్స్ లేవన్న కేజ్రీవాల్! ఢిల్లీలో కేసీఆర్ చర్చలు ఉత్తవేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook