స్వతంత్ర భారతావనిలో జనవరి 26 అతిముఖ్యమైన రోజు. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో  ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం సిద్ధించింది. తద్వారా మనం సొంతంగా పరిపాలన చేసుకోవడం ప్రారంభించాం. కానీ మనం ఎలా నడుచుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలో భారత ప్రభుత్వ చట్టం 1935ని అనుసరించాల్సి వచ్చేది. బ్రిటీషు వారు అందించిన చట్టం వద్దని సొంతంగా భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగం అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 సంవత్సరాల 11 నెలల 18రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారు. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే 1950 జనవరి 26వ తేదీ నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. తద్వారా భారత్ ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య’ రాజ్యంగా అవతరించింది. అప్పటినుంచి ప్రతి ఏటా జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం గుర్తింపు పొందుతోంది. నేడు 71వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని మీ స్నేహితులు, సన్నిహితుకులకు ఇలా శుభకాంక్షలు తెలపండి..


Also Read: మరణానంతరం 12 మందికి పద్మ పురస్కారాలు


[[{"fid":"181385","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


భవిష్యత్ తరాలు తమ జీవితాలను గౌరవంగా గడపడానికి ఎందరో మహానుభావులు సాహసోపేతమైన పోరాటం చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం. ఆంగ్లేయులపై పోరాటంలో విజయం. స్వీయ పాలనా రాజ్యాంగం.. హ్యాపీ రిపబ్లిక్ డే


దేశం మనదే తేజం మనదే - ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే - ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా - మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం...   Happy Republic Day 2020


[[{"fid":"181386","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"2"}}]]


మూడు రంగుల జెండా... ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. మన అంధకారాన్ని పొగొట్టిన జెండా
భారత్ గణతంత్ర రాజ్యామని తెలిపిన అజెండా మన రాజ్యాంగం...  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 


 


మనసులో స్వేచ్ఛ, మాటల్లో బలం, మన రక్తంలో స్వచ్ఛత, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు వందనం చేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే


కులాలు, మతాలు, భాషలు వేరైనా...
మనమంతా భారతీయులం.. మనదందా ఒకటే జాతి భారతజాతి..  Happy Republic Day


భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారత గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశంలో పుట్టి ఎందరో ధన్యులయ్యారు..  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..