పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడైన హార్థిక్ పటేల్
పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడైన హార్థిక్ పటేల్
అహ్మెదాబాద్: పటేల్ వర్గానికి రిజర్వేషన్ డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తోన్న పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) నేత హార్ధిక్ పటేల్ నేడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. సురేంద్ర నగర్ జిల్లా ములి తాలుకాలోని డిగ్సర్ గ్రామంలో హార్ధిక్ పటేల్ వివాహం ఓ వేడుకగా జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురైన కింజల్ పరీఖ్‌తో హార్థిక్ పటేల్ వివాహం జరిగింది. అహ్మెదాబాద్ జిల్లాలోని విరంగం ప్రాంతానికి చెందిన కింజల్ పరీఖ్ ప్రస్తుతం లా చదువుకుంటోంది.