Haryana JK Results 2024: దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ మద్య పోటీ గట్టిగా ఉంది. ఆర్టికల్ 370 తొలగింపు, రాష్ట్ర హోదా తీసివేయడం వంటి ప్రయోగాలతో జమ్ము కశ్మీర్‌లో అధికారం కోసం ప్రయత్నించిన బీజేపీ ఆశలు అడియాశలవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జమ్ము కశ్మీర్‌లో నిజం కానున్నాయి. హర్యానాలో ఇంకా పోటీ హోరాహోరీగా ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 అసెంబ్లీ స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా అటు పీడీపీ, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగాయి. మేజిక్ ఫిగర్ 46 కాగా కాంగ్రెస్ -నేషనల్ కాన్ఫరెన్స్ జోడీ ఇప్పటికే 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఇతర పరిణామాల నేపధ్యంలో జరిగిన ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ జోడీ 50 సీట్ల ఆధిక్యం కొనసాగిస్తూ అధికారం కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. 


జమ్ము ప్రాంతంలో ఓటర్లను నమ్ముకుని బరిలో దిగిన బీజేపీకు ఆ ప్రాంతంలో ఆశించిన సీట్లే లభించనున్నాయి. ప్రస్తుతం బీజేపీ 24 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మరో ప్రాంతీయ పార్టీ పీడీపీ మాత్రం కేవలం 3-4 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు అంటే స్వతంత్రులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 


మరోవైపు హ్యాట్రిక్ సాధిద్దామని భావించిన బీజేపీకు పరిస్థితి మరోలా ఉంది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తోంది. ఆదిక్యం అటూ ఇటూ మారుతోంది. కాస్సేపు కాంగ్రెస్‌కు ఆధిక్యం, కాస్సేపు బీజేపీకు ఆధిక్యం కన్పిస్తోంది. 


Also read: Assembly Elections Results 2024 Live: హర్యానాలో బిగ్ ట్విస్ట్.. బీజేపీ దూకుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.