Anti Conversion Passes in Haryana Assembly:  మతమార్పిడి నిరోధక బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే కర్ణాటక, ఉత్తరప్రదేశ్,  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించగా... ఇప్పుడు  ఆ జాబితాలో హర్యానా రాష్ట్రం కూడా చేరింది . బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లును హర్యాన సర్కార్ ఆమోదించింది. అయితే ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ హర్యానా కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి వాక్ ఔట్ చేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన హర్యానా ప్రీవెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వెర్షన్ ఆఫ్ రిలిజయన్ బిల్లు-2022 ప్రకారం ఇకపై మత మార్పిడులు అంత తేలిక కావు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హర్యానా రాష్ట్రం పరిధిలో మహిళలు, మైనర్లు,  షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని బలవంతంగానో ప్రలోభానికి గురి చేయడం వల్లనో  మతమార్పిడి చేస్తే ఇకపై అది శిక్షార్హం కానుంది. మత మార్పిడి చేసిన వాళ్లతో పాటు ఇందుకు సహకరించిన వాళ్లు కూడా నిందితులు కానున్నారు. వీరికి కనిష్టంగా నాలుగేళ్లు... గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడనుంది. మూడు లక్షల రూపాయల వరకు జరిమాన కూడా విధిస్తున్నారు. హర్యాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 


అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. బలవంతపు చర్యలను అడ్డుకునేందుకు ఈపాటికే చాలా చట్టాలు ఉండగా మళ్లీ కొత్త చట్టం చేవాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. బిల్లు పాస్ కావడం అంటే హర్యానా చరిత్రలో ఈరోజు ' ఒక చీకటి రోజు' గా అభివర్ణించారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించి ప్రజల మధ్య పేరుకుపోయిన గోడల్ని బద్దలు కొట్టడానికి బదులు వాటిని మరింత పటిష్టం చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.


ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ బిల్లును  ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో  మాట్లాడుతూ "తాము ఏ వర్గాన్ని చిన్నచూపు చూసేందుకు ఈ  బిల్లు తీసుకురాలేదని అన్నారు. ప్రజల వ్యక్తిగత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బలవంతపు చర్యలను అడ్డుకునేందుకు మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. పెళ్లి ద్వారా ఒక మతం నుంచి మరొక మతానికి చాలా మంది బలవంతంగా తమ విశ్వాసాలను మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దాన్ని అడ్డుకునేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని" కట్టర్ తెలిపారు.


Also Read: Bhoiguda fire accident: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్పందన- బాధితులకు నష్ట పరిహారం ప్రకటన


Also Read: India Corona Update: దేశంలో 2 వేల లోపే కొత్త కరోనా కేసులు- మరణాలు ఎన్నంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook