Bhoiguda fire accident: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్పందన- బాధితులకు నష్ట పరిహారం ప్రకటన

Bhoiguda fire accident: సికింద్రాబాద్​ గోడౌన్​లో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్​ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని సీఎం తెలిపారు. మృతులకు రూ.5 లక్షల చొప్పన పరిహారం ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 11:59 AM IST
  • సికింద్రాబాద్​ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం విచారం
  • బాధితులను ఆదుకుంటామని హామీ
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, గవర్నర్​
Bhoiguda fire accident: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్పందన- బాధితులకు నష్ట పరిహారం ప్రకటన

Bhoiguda fire accident: సికింద్రాబాద్​ బోయగూడలోని గోడౌన్​లో అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది వలస కూలీల దుర్మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ముఖ్యమంత్రి.. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నష్టపరిహారం ప్రకటన..

అగ్నిప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అదే విధంగా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​కు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి.

ప్రముఖుల స్పందన..

బోయగూడ ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా స్పందించారు. వలస కార్మికుల మృతి బాధాకరమన్నారు. కష్టసమయంలో బాధిత కుటుంబాలకు శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

గవర్నర్​ తమిళిసై దిగ్భ్రాంతి..

బోయగూడ అగ్ని ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందని గవర్నర్​ తమిళసై అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఘటనపై మరిన్ని వివరాలు..

సికింద్రాబాద్‌ బోయగూడలోని.. గోడౌన్​లో షార్ట్ సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కార్మికులు అందులో నిద్రిస్తున్నట్లు తెలిసింది. నిద్రలో ఉన్న కారణంగానే మరణాలు అధికంగా నమోదైనట్లు సమాచారం. మృతులంతా బిహార్ వలస కార్మికులే కావడం గమనార్హం.

Also read: Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

Also read: Fuel Prices In Hyderabad: వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్.. భగ్గుమంటున్న పెట్రో ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News