Haryana High Court: భర్త అనంతరం భార్యకు కూడా పెన్షన్ లభిస్తుంది. భార్యే హంతకురాలైతే పెన్షన్ వర్తించదు కదా. అక్కడి ప్రభుత్వం అదే అనుకుంది. కానీ హైకోర్టు కాదంది. చంపినా సరే..పెన్షన్ ఇవ్వాల్సిందేనంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హర్యానా ( Haryana )లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. హైకోర్టు తీర్పు అంతకంటే సంచలనంగా మారింది. ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని పంజాబ్-హర్యానా హైకోర్టు ( Punjab-Haryana High Court ) సంచలన తీర్పిచ్చింది. అసలేం జరిగిందంటే..


హర్యానాలో ఓ ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన కేసులో భార్య బల్జీత్ కౌర్ దోషిగా తేలింది. 2008లో ఆమె భర్త హత్యకు గురయ్యాడు. భార్యే భర్తను హతమార్చిందంటూ పోలీసులు 2009లో ఆమెపై కేసు పెట్టారు. 2011లో బల్జీత్ కౌర్ దోషిగా తేలింది. దాంతో 2008 నుంచి 2011 వరకూ హర్యానా ప్రభుత్వం ( Haryana Government ) ఇచ్చిన పెన్షన్ ను నిలిపివేసింది. భర్తను హత్య చేసిన కారణంగా భార్యకు పెన్షన్ ఇచ్చేది లేదని తెలిపింది. దాంతో ఇటీవల బల్జీత్ కౌర్ హర్యానా కోర్టులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.


భర్తను భార్యే చంపిందని సాక్ష్యాధారాలతో రుజువైనా..భార్యకు మాత్రం ఫ్యామిలీ పెన్షన్ ( Family Pension ) ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే  ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారని..అలాంటిది ఎటువంటి ఆర్ధిక భరోసా లేని భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తే తప్పేంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా పూర్తి బకాయిలతో పాటు పెన్షన్ చెల్లించాల్సిందిగా సంబంధిత శాఖకు హైకోర్టు ఆదేశించింది. 


Also read: CA November Result 2020: సీఏ ఫైనల్ రిజల్ట్ డేట్ ప్రకటించిన ICAI, రిజల్ట్ ఇలా చెక్ చేసుకొండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook