Sandeep Singh: హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్ సందీప్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు.. పదవికి రాజీనామా
Haryana Sports Minister Sandeep Singh Resigns: తనపై జూనియర్ మహిళా కోచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్ తన పదవికి రాజీనామా చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. విచారణ పూర్తయ్యే వరకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
Haryana Sports Minister Sandeep Singh Resigns: హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సందీప్ సింగ్‌పై జూనియర్ మహిళా కోచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మరోవైపు దీనిపై విచారణ జరుపుతున్న డీజీపీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
మహిళా కోచ్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సందీప్ సింగ్ అన్నారు. కావాలనే తన ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. విచారణ నివేదిక వచ్చే వరకు క్రీడా శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నానని చెప్పారు.
మరోవైపు మహిళా కోచ్ అంబాలాలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలు తన గతాన్ని హోంమంత్రికి వివరించారు. 2016 రియో ఒలింపిక్స్ తర్వాత సందీప్ సింగ్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్నాప్‌చాట్ సందేశాలను పంపాడని జూనియర్ మహిళా కోచ్ ఆరోపించారు. కొంతకాలం క్రితం సందీప్ తనను తన కార్యాలయానికి పిలిచారని చెప్పారు.
'నువ్వు నన్ను సంతోషంగా ఉంచు. నేను నిన్ను సంతోషంగా ఉంచుతానని మంత్రి అన్నారు. ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. ఆయనను సంతోషంగా ఉంచితే కోరిన చోట పోస్టింగ్ ఇస్తానన్నారు. అయితే నేను లొంగకపోవడంతో నన్ను వేరే చోటుకు బదిలీ చేశారు..' అని బాధితురాలు వాపోయారు. తనతోపాటు చాలా మంది క్రీడాకారిణులను మంత్రి లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఆయనకు భయపడి ఎవరూ బయటపడలేదన్నారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ సింగ్ ఒకప్పుడు టీమిండియా హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా పనిచేశారు. 2018లో ఆయన జీవిత చరిత్రపై బయోపిక్ కూడా వచ్చింది.
మహిళా కోచ్ బాధితురాలి ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపులు, నిర్బంధ కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి మాట్లాడుతూ.. హర్యానాకు చెందిన ఒక మహిళా కోచ్ ఫిర్యాదు ఆధారంగా మంత్రి సందీప్ సింగ్‌పై 354, 354A, 354B, 342, 506 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
Also Read: Nashik Factory Fire: నాసిక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 14 మందికి గాయాలు
Also Read: Prithvi Shaw GirlFriend: గాళ్‌ఫ్రెండ్‌తో న్యూ ఇయర్ నైట్ సెలబ్రేట్ చేసిన పృథ్వీషా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook