Prithvi Shaw Girl Friend: గాళ్‌ఫ్రెండ్‌తో న్యూ ఇయర్ నైట్ సెలబ్రేట్ చేసుకున్న పృథ్వీ షా

Prithvi Shaw Girl Friend Photos : పృధ్వీ షా పోస్ట్ చేసిన ఫోటోల్లో కనిపిస్తున్న అమ్మడు ఇంకెవరో కాదు.. యంగ్ హీరోయిన్ కమ్ మోడల్ అయిన ఈ మరాఠి బ్యూటీతో కలిసి గతంలోనూ పృధ్వీ షా కెమెరాలకు ఫోజిచ్చాడు. అంతేకాకుండా ఆమెతో కలిసి తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 04:42 PM IST
Prithvi Shaw Girl Friend: గాళ్‌ఫ్రెండ్‌తో న్యూ ఇయర్ నైట్ సెలబ్రేట్ చేసుకున్న పృథ్వీ షా

Prithvi Shaw Girl Friend Photos: ఇండియన్ క్రికెటర్, ఐపిఎల్ టోర్నమెంట్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృధ్వీ షా మరోసారి తన గాళ్ ఫ్రెండ్‌తో కనిపించి వార్తల్లోకెక్కాడు. 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక పబ్ లో గాళ్ ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాడు. పబ్ బ్యాక్‌డ్రాప్ చూస్తోంటే అది ముంబైలోని పబ్ అయ్యుంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గాళ్ ఫ్రెండ్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన ఫోటోలను పృధ్వీ షానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి లీక్ చేశాడు. ప్రస్తుతం పృధ్వీ షా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పృధ్వీ షా పోస్ట్ చేసిన ఫోటోల్లో కనిపిస్తున్న అమ్మడు ఇంకెవరో కాదు.. యంగ్ హీరోయిన్ కమ్ మోడల్ నిధి రవి తపాడియా. గతంలోనూ నిధి తపాడియాతో కలిసి పృధ్వీ షా కెమెరాలకు ఫోజిచ్చాడు. అంతేకాకుండా నిధితో కలిసి తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశాడు. కొన్ని రీజినల్ మూవీస్, మ్యూజిక్ వీడియోలలో కనిపించిన నిధి తపాడియాకు ఇంకా తగినంత ఫేమ్ రాకపోవడంతో అమ్మడి గురించి చాలామందికి పెద్దగా తెలియదు. దీంతో ఈ విషయం తెలియని వారు పృధ్వీ షా పక్కనున్న సీక్రెట్ గాళ్ ఫ్రెండ్ ఎవరా అని ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే, పృధ్వీ షా అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి నిధి సుపరిచితమే.

Prithvi-Shaw-GirlFriend-Nidhhi-Ravi-Tapadiaa-Photos.jpg

పృద్వీషా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రంజీ ట్రోఫీలతో బిజీగా ఉన్న పృధ్వీ షా.. డొమెస్టిక్ క్రికెట్, ఐపిఎల్ కెరీర్ లో సత్తా చాటుతూనే మరోసారి టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2021 జూలైలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో చివరిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన పృద్వీ షా అప్పటి నుంచి టీమిండియా కోసం బిసిసిఐ నుంచి పిలుపు కోసం వేచిచూస్తూనే ఉన్నాడు. తనకు భారత జట్టులో అవకాశం రాకపోవడంపై పలు సందర్భాల్లో అసహనాన్ని కూడా వెళ్లగక్కాడు. 

ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన సిరీస్‌లకు బిసిసిఐ నుంచి కాల్ వస్తుందని ఆశపడినా అది నేరవేరలేదు. చివరకు ఎల్లుండి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20, వన్డే సిరీస్‌లకు కూడా పృధ్వీ షాకు ఛాన్స్ రాలేదు. ఏదేమైనా పృధ్వీ షా మాత్రం కుండిపోకుండా రైట్ టైమ్ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూనే కొత్త సంవత్సరాన్ని ఇలా తన గాళ్ ఫ్రెండ్ అయిన నిధి తపాడియాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అతడిలో పాజిటివ్ అండ్ స్పోర్టివ్ స్పిరిట్‌కి నిదర్శనం అంటున్నారు పృధ్వీ షా ఫ్యాన్స్.

ఇది కూడా చదవండి : Team India: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. ఆ సిరీస్ గెలిస్తే..

ఇది కూడా చదవండి : IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..

ఇది కూడా చదవండి : Rishabh Pant Accident: 'పంత్'ను గుర్తుపట్టలేదు.. చూడగానే చనిపోయాడనుకున్నా కానీ అమ్మకి ఫోన్ చేయమన్నాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x