Heavy security for Hathras victim family: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Harthras) లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. సిట్ (SIT), సీబీఐ (CBI) కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్రాస్ బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు రక్షణగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ మేరకు యూపీ పోలీసు ఉన్నతాధికారులు హత్రాస్ జిల్లా బుల్‌గ‌డి గ్రామంలో బాధితురాలి కుటుంబ‌స‌భ్యుల‌కు ర‌క్ష‌ణ‌గా 60 మంది పోలీసులను (UP Police) మోహ‌రించారు. అంతేకాకుండా ఇంటి ప‌రిస‌రాల్లో 8 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ మేరకు యూపీ పోలీసు ఉన్నతాధికారులు శుక్ర‌వారం వెల్ల‌డించారు. దీంతోపాటు గ్రామంలో పరిస్థితులను పర్యవేక్షించడానికి డీఐజీ షాలాబ్ మాథుర్‌ను ల‌క్నో నుంచి హ‌థ్రాస్‌కు నోడ‌ల్ అధికారిగా పంపించారు. ఈ మేరకు డీఐజీ షాలబ్ మాథూర్‌ మాట్లాడుతూ.. అవసరమైతే గ్రామంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  Also read: Harthras Case: సిట్ కాలపరిమితి పొడిగింపు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ‌హిళా పోలీసుల‌తో క‌లిపి మొత్తం 60 మంది పోలీసులను బాధితురాలి ఇంటి ద‌గ్గ‌ర మోహరించిన‌ట్లు హ‌థ్రాస్ ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు. వీరంతా బాధిత కుటుంబానికి, సాక్షులకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి ప‌నిచేస్తార‌ని చెప్పారు. నిరంతరం సీసీ టీవీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. పరామర్శించేందుకు వస్తున్న వారి వివరాలను సైతం నమోదు చేస్తున్నట్లు వివరించారు. Also read: Hathras Case: అందుకే అర్థరాత్రి అంత్యక్రియలు: యూపీ ప్రభుత్వం


సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే అదేరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆ తరువాత ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన హత్రాస్ ఎస్పీతో సహా ఐదుగురు పోలీసు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును సీబీఐకి సైతం యూపీ ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ నెల 16 సిట్ నివేదిక రానుంది. Also read: Hathras Gang Rape Case: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe