హథ్రాస్ గ్యాంగ్ రేప్ కేసు (Hathras Gang Rape Case) వివాదంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతుంటే ఓ బీజేపీ (BJP) నేత మాత్రం అత్యంత దారుణమైన కామెంట్లు చేశారు. అత్యాచారాలు ఆగాలంటే తమ కూతుళ్లకు మర్యాదగా, పద్ధతిగా ప్రవర్తించడం తల్లిదండ్రులు నేర్పించాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ (BJP MLA Surendra Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read : Hathras Case: నిన్న రాహుల్ గాంధీ.. నేడు డెరిక్ ఓబ్రెయిన్.. అలాగే కిందపడేశారు!
అత్యాచారాలు పెరగడానికి అమ్మాయిల తల్లిదండ్రులు, వారి పెంపకమే కారణమని, దీనిపై వారిదే బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల, శిక్షల వల్ల అత్యాచారాలు ఆగవని, అమ్మాయిలకు మంచి విలువలు, సంస్కారం నేర్పిస్తే రేప్‌లు తగ్గుతాయన్నారు. తాను ఎమ్మెల్యే మాత్రమే కాదని, టీచర్‌ను కూడా అని పేర్కొన్నారు.
Also Read : Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు
#WATCH Incidents like these can be stopped with help of good values, na shashan se na talwar se. All parents should teach their daughters good values. It's only the combination of govt & good values that can make country beautiful: Surendra Singh, BJP MLA from Ballia. #Hathras pic.twitter.com/47AmnGByA3
— ANI UP (@ANINewsUP) October 3, 2020
సమాజంలో పద్ధతిగా, సంస్కారంగా ఎలా నడుచుకోవాలో తమ కూతుళ్లగా తల్లిదండ్రులు నేర్పించాలని, మంచి విలువల వల్లే ఇలాంటి ఘటనలు జరగవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సైతం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓ వైపు తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విలువలు నేర్పితే.. మరోవైపు ప్రభుత్వం వారి కోసం తగిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు.
Also Read : CT Ravi Resignation: మంత్రి పదవికి సీటీ రవి రాజీనామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe