Hathras stampede Bhole baba properties 5 star ashram on land worth 4 crores: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా తీవ్ర సంచనంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం యోగి, ప్రధాని మోదీ,  రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొన్ని ఇతర దేశాలు సైతం.. దీనిపై తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 120 మంది అమాయాకులు చనిపోయినట్లు తెలుస్తోంది. భోలా బాబా సత్సంగ్ చివరి రోజున భక్తులు పొటేత్తారు. అక్కడికి వచ్చిన భక్తులు కూడా.. బాబా పాద ధూళికోసం పోటీ పడ్డారు. ఈ ధూళీని తమ ఇంటికి తీసుకెళ్తే నెగెటివ్ ఎనర్జీ దూరమైపోతుందని, మంచి జరుగుతుందని అక్కడి వాళ్లు నమ్ముతుంటారు. అందుకే భక్తులంతా ఒక్కసారిగా భోలే బాబా దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించడంతో, పెనుగులాట సంభవించింది. ఈ క్రమంలో  ఒక్కసారిగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more; Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. భోలే బాబా గురించిన అనేక సంచలన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అత్యంత టైట్ సెక్యురిటీని ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది.  భోలే బాబా కు మూడంచెల సెక్యురిటీ ఉంటుందంట.  నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే బృందాలు బాబాకు 24 గంటలు కూడా సెక్యురిటీని అందిస్తారంట. నారాయణ  సేన పింక్ డ్రెస్ ధరిస్తారు. గరుడ్ యోధ బ్లాక్ దుస్తులు, హరి వాహక్ సభ్యులు బ్రౌన్ డ్రెస్సులు వేసుకుంటారు.


బాబా కాన్వాయ్ వెంట దాదాపు.. 20 మంది బ్లాక్ కమాండోలు ఎల్లవేళలా కాపాలా కాస్తుంటారు. నారాయణ సేనకు చెందిన 50 మంది, హరి వాహక్ సభ్యులు 25 మంది ఉంటారంట. మరోవైపు భోలేబాబా తరపు కొందరు లాయర్లు మాత్రం ఆయన విచారణకు సహకరిస్తారని అంటున్నారు. ఇక ఈ ఘటనల్లో చనిపోయిన వారు సైతం.. భోలే బాబా దేవుడు ఆయనకు ఇదంతా ముందే తెలుసు.. ఆయనపై అభాండాలు వేయోద్దంటూ కూడా అంటుండం చూస్తే వీరికి భోలేబాబా అంటే ఎంత గుడ్డి భక్తో అర్థమౌతుంది.


121 మంది మృతికి కారణమైన సత్సంగ్ కార్యక్రమం నిర్వహించిన భోలే బాబాకు కళ్లు చదిరే ఆస్తులు ఉన్నాయంట. ఆయనకు ఉన్న ఆస్తులు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైనే అని అధికారులు అంచనా వేస్తున్నారు. సత్సంగ్ తొక్కిసలాటలో 121 మంది చనిపోగా.. భోలేబాబా గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


బోలే బాబా తరచూ తెల్లటి సూటు, బూట్లు, నల్లని కళ్లద్దాలు ధరిస్తుంటాడు. కాస్‌గంజ్‌, ఆగ్రా, కాన్నూర్‌, గ్వాలియర్‌ సహా మొత్తంపలు చోట్ల 24 విలాసవంతమైన ఆశ్రమాలు బాబాకు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో వీటిని మెయింటెన్ చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.


సూరజ్‌పాల్‌ మెయిన్‌పురిలో 14 ఎకరాల్లో విస్తరించి ఉన్న విలాసవంతమైన హరి నగర్‌ ఆశ్రమంలో ఉంటాడు. వ్యక్తిగత కమాండోలు 17 మంది ఎల్లప్పుడు ఆయనకు భద్రత అందిస్తుంటారు. టయోటో ఫార్చునర్ కారును భోలేబాబా వినియోగిస్తాడు. భోలే బాబా కారుకు ముందు 16 మంది బాడీగార్డులు.. ఖరీదైన బైక్‌లపై వెళ్తూ.. ఆయన కారుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తారు.


Read more: Snake bite: ఇదేక్కడి విడ్డూరం..వ్యక్తిని కాటు వేసి.. చనిపోయిన పాము.. అసలు కథ మాములుగా లేదుగా..


ఇక ఆయన కారు వెనకాల దాదాపు 30 కార్లతో భారీ కాన్వాయ్‌ ఉంటుంది. కారు బయట లోపల మొత్తం తెల్లగా ఉంటుంది. బాబా వస్తున్నాడంటే ఓ వీఐపీకి సమానంగా భద్రత కల్పిస్తారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా తనిఖీ చేస్తారు. కళ్లు చెదిరే ఆస్తులు చూసి స్థానికులు, భక్తులు నోరెళ్లబెడుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి