HCL Recruitment : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో భారీగా ఉద్యోగాలు కొలువు దీరాయి. అది కూడా మీకు దగ్గరలో విజయవాడ కేంద్రంలో. ఇంకెందుకు ఆలస్యం..త్వరపడండి. ఇంటర్ చదివిన వారికి కూడా అవకాశముంది మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీ‌ఎల్ టెక్నాలజీస్ ( HCL Technologies ) ఏపీలోని విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరంలో గ్లోబల్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెంటర్‌లో భారీగా ఉద్యోగాల డ్రైవ్ ప్రారంభిస్తోంది. ఏకంగా వేయి ఖాళీల్ని భర్తీ చేయనుంది. వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియేట్ , బీటెక్, ఎంటెక్ వంటి ఐటీ కోర్సులు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వర్చువల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ( Hcl Recruitment drive ) నిర్వహించనుంది. 


ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీటెక్ వంటి కోర్సులతో పాటు జావా, చిప్ డిజైనింగ్, డాట్‌నెట్, పైథాన్ టెక్నాలజీస్‌లో 2-8 ఏళ్ల అనుభవమున్నవారు  ఈ మెగా వర్చువల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనవచ్చు.  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో న్యూ విస్టాస్ ప్రోగ్రామ్‌లో భాగంగా విజయవాడ గన్నవరం ( hcl Vijayawada unit ) యూనిట్ నెలకొల్పారు. ఇప్పటికే ఈ యూనిట్‌లో 15 వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో వేయి ఖాళీల్ని భర్తీ చేయనున్నారు. 


Also read: JEE Mains 2021: జేఈఈ మెయిన్స్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, ఏ దశ పరీక్షలు ఎప్పుడు..


ఎంపికైన అభ్యర్దులకు ఏపీ ప్రభుత్వ( Ap Government ) సహకారంతో శిక్షణ ఉంటుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన వివరాల్ని https://www.hcltech.com/careers వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మరో నాలుగేళ్ల వ్యవధిలో విజయవాడ యూనిట్‌లో ఉద్యోగుల సంఖ్య 5 వేలకు చేరుకోవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో టెక్‌బీ పేరిట ఎర్లీ కెరీర్ అనే ప్రోగ్రామ్ నడుస్తోంది. ఇంటర్మీడియేట్ 65 శాతం మార్కులతో పాస్ అయినవారు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది పాటు శిక్షణ అనంతరం ఎంట్రీలెవెల్ ఉద్యోగం కల్పించనున్నారు. 


మరోవైపు ఉన్నత విద్య చదువుకోవాలనుకునే టెక్‌బీ స్కాలర్స్‌కు బిట్స్ పిలానీ లేదా యూనివర్శిటీ విద్యాభ్యాసం కోసం హెచ్‌సీ‌ఎల్ టెక్నాలజీస్ సహకారం అందించనుంది. టెక్‌బీ ప్రోగ్రామ్ కోసం ఇప్పటికే 750 మంది విద్యార్ధులు ఎన్‌రోల్ అయ్యారు. 


Also read: Rajiv Gandhi Assassination case: నిందితులకు క్షమాభిక్ష పరిస్థితి ఏంటి..గవర్నర్‌కు ఆ అధికారం లేదా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook