బెంగళూరు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్‌గా అభివర్ణిస్తూ గతంలో ఓ పుస్తకం వెలువడిన సంగతి తెలిసిందే. ఇక ఇదే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్‌ అనే టైటిల్‌తో ప్రస్తుతం ఓ సినిమా సైతం తెరకెక్కుతోంది. ఇటీవల సామాజిక మాద్యమాల్లో తీవ్ర చర్చనియాంశమైన ఈ సినిమాపై రాజకీయ నాయకుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇదే విషయమై ఈ సినిమా గురించి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడను అభిప్రాయం కోరగా ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. "తాను కూడా ఓ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్‌‌నే కదా' అని అభిప్రాయపడిన ఆయన.. తాను 10 నెలలు దేశాన్ని పాలిస్తే, ప్రధానిగా మన్మోహన్ సింగ్ 10 ఏళ్లు దేశాన్ని పాలించారు" అని అన్నారు. పదేళ్లు పరిపాలించిన ప్రధానిని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్‌ అని ఎలా పిలుస్తారని దేవేగౌడ ప్రశ్నించారు.