కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ఇటీవల బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్ విధించారు. ఏపీ, కర్ణాటకల మధ్య మరో వారం రోజులపాటు బస్సు సర్వీసులు సైతం నిలిపివేశారు. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు భిన్నంగా (Sriramulu On CoronaVirus) స్పందించారు. మన చేతుల్లో ఏం లేదు, దేవుడే మనల్ని కాపాడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.  కార్మికుడి కరోనా బిల్లు రూ.1.52 కోట్లు.. ఆపై ట్విస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 కరోనా వ్యాప్తిని (Karnatka CoronaVirus Cases) అరికట్టడం మన చేతుల్లో లేదన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్19 సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని, కేసులు రెట్టింపులు అవుతున్నాయని మంత్రి శ్రీరాములు గుర్తుచేశారు. ఇది మంత్రుల నిర్లక్ష్యం వల్లనో, లేక అధికారులు, మంత్రుల మధ్య సమన్వయలోపం వల్లనో జరగడం లేదన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారని, సోషల్ డిస్టాన్సింగ్, మాస్కులు ధరించటం లాంటి జాగ్రత్తలు పాటించడం తప్ప చేసేందేమీ లేదన్నారు. Corosure: అత్యంత చవకైన కరోనా టెస్ట్ కిట్‌ 


మంత్రి శ్రీరాములు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బుధవారం సాయంత్రానికి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే కరోనాను త్వరగా జయిస్తామన్నది తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని, వచ్చే రెండు నెలల్లో అసలైన సవాళ్లు ఎదురుకానున్నాయని అభిప్రాయపడ్డారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన పెంచుకుని జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని మంత్రి శ్రీరాములు సూచించారు. కాగా, కర్ణాటకలో కరోనా కేసులు దాదాపు 50వేల వరకు నిర్ధారించారు. ఇప్పటికే 900 మంది కోవిడ్19 కారణంగ మరణించారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..