Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్
కరోనా కారణంగా జనం రాకపోవడంతో తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేకపోవడంతో చేసిన వంటలన్నీ వృధా అవుతున్నాయని ఒక చిన్న డబ్బా కొట్టులాంటి దుకాణంలో బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి ఎంతో మంది జీవితాలను ఆర్థిక సంక్షోభంలోకి ( Financial crisis ) నెట్టింది. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారం చేసుకునే చిన్న, మధ్య తరగతి కుటుంబాలపై కరోనా తీవ్ర ప్రభావం ( Coronavirus crisis ) చూపించింది. అలా కరోనా కారణంగా జనం రాకపోవడంతో తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేకపోవడంతో చేసిన వంటలన్నీ వృధా అవుతున్నాయని ఒక చిన్న డబ్బా కొట్టులాంటి దుకాణంలో బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో హనుమాన్ మందిర్‌కి ఎదురుగా ఈ హోటల్ ఉందని, వీలైతే అటువైపు వెళ్లినప్పుడు ఈ హోటల్‌ని సందర్శించండి అని నెటిజెన్స్‌కి సూచిస్తూ ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది. ట్విటర్‌లో #BABAKADHABA హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో పలువురు తమకు తోచిన రీతిలో ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు.
కరోనావైరస్ సంక్షోభంలో ఎంతోమందికి సోషల్ మీడియా ద్వారా సహాయం లభించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇదిగో ఈ వృద్ధ దంపతులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో మెయిన్ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై బాబా కా ధాబా పేరిట ఈ వృద్ధ దంపతులు ఒక చిన్న హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ హోటల్‌తో వాళ్లేం లక్షలు కోట్లు సంపాదించడం లేదు.. వాళ్లకు అదే బతుకుదెరువు.. హోటల్‌కి కస్టమర్స్ వస్తేనే వాళ్లకూ రోజూ గడిచిపోయేది. లేదంటే బతకడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో తమ హోటల్‌కి వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేస్తూ ఆ వృద్ధ దంపతులు కన్నీళ్లు పెట్టుకోవడం నెటిజెన్స్‌ని కదిలించింది. అలా ఆ వీడియో వైరల్‌గా మారడమే ఆలస్యం.. ఆ చుట్టుపక్కల వాళ్లంతా బాబా కా దాబాను సందర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ హోటల్ బయట క్యూ లైన్స్ కనబడుతున్నాయి. బాబా కూడా హోటల్ గిరాకీ షురూ అవడంపై ఖుషీగా ఉన్నాడు.
బాబా కా దాబా నిర్వహిస్తున్న వృద్ధ దంపతుల కష్టాలపై వీడియో వైరల్‌గా ( Baba ka dhaba viral video ) మారడంతో మీడియా సైతం వారి ఆకలి కష్టాలపై బోలెడన్ని కథనాలు ప్రసారం చేసింది. దీంతో అక్కడ చిన్నగా మళ్లీ గిరాకి పెరిగింది. బాబా కా దాబా గురించి తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, స్థానిక ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి ( AAP MLA Somnath Bharti ) అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. ప్రభుత్వం తరపున వారికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని సోమ్‌నాథ్ భారతి హామీ ఇచ్చారు.
Baba message for everyone!
RT if you Salute #BABAKADHABA pic.twitter.com/Y5xHijbxmm
ఐతే హోటల్ నిర్వహిస్తున్న వృద్ధుడు బాబా మాత్రం తనకు మాత్రమే సహాయం అందితే చాలని అనుకోవడం లేదు. తనలా కూడు, గూడు లేక ఇబ్బందులు పడుతున్న వారికి అందరికీ సహాయం అందితే బాగుంటుందని అర్థిస్తున్నాడు. ఇంత పేదరికంలోనూ తనకు మాత్రమే సహాయం అందితే చాలనే స్వార్థం లేకుండా.. తనలాంటి వారికి అందరినీ ఆదుకోండి అని వేడుకోవడం బాబా గొప్ప మనసుకు నిదర్శనం. నిజమే.. బాబా చెప్పినట్టు తినడానికి తిండి లేని వారికి, ఉండటానికి ఇల్లు లేని వారికి అందరికీ న్యాయం జరిగితే ఎంత బాగుంటుందో కదా!! బాబా కోరిక నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.
బాలీవుడ్ ప్రముఖులు ( Bollywood celebrities ) రవీనా టాండన్, రందీప్ హుడా, స్వర భాస్కర్, నిమ్రత్ కౌర్, సోనం కపూర్, సునిల్ షెట్టి, అతియా షెట్టి లాంటి వాళ్లు ఇలాంటి వారికి సహాయం చేసేందుకు జనం ముందుకు రావాల్సిందిగా పిలుపునివ్వగా.. వారి వివరాలు తెలుసుకుని వారికి నేరుగా సహాయం అందించేందుకు సోనం కపూర్ ( Actress Sonam kapoor ) ముందుకు రావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe