Karnataka: కర్నాటకలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. బీజేపీ నాయకత్వమార్పు ఉంటుందా లేదా అనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్సెస్ వ్యతిరేకవర్గం మధ్య వాగ్వాదం పెరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక(Karnataka). కర్నాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వ్యతిరేకంగా నిరసన పెరుగుతోంది. అధికారమార్పుపై వ్యతిరేకవర్గం డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ప్రభుత్వ పాలనలో కలుగజేసుకుంటున్నారంటూ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. యడ్యూరప్ప మంత్రివర్గంలో సభ్యుడు మంత్రి యోగీశ్వీర్ అయితే నేరుగానే ఇది మూడు ముక్కల ప్రభుత్వమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ఈ తరుణంలో యడ్యూరప్ప(Yeddyurappa) తనయుడు విజయేంద్ర ఢిల్లీ పర్యటన చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీజేపీ (BJP)రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్‌ను కలిసి..రాష్ట్రంలోని రాజకీయాల గురించి చర్చించే అవకాశముంది. మంత్రి యోగీశ్వర్ వ్యాఖ్యల వల్ల పార్టీకు, ప్రభుత్వానికి అవమానం జరిగిందని..మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్టానాన్ని కోరే అవకాశముంది. బళ్లారి జిల్లాలో జిందాల్ సంస్థకు ఇచ్చిన 3 వేల ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడంపై వివరణ ఇవ్వనున్నారు. పార్టీ అధిష్టానానికి తన వాదనను విన్పించేందుకు ముఖ్యమంత్రే తనయుడిని పంపినట్టు తెలుస్తోంది.


Also read: CBSE 12th Class Exams: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook