West Bengal: హీట్ వేవ్ ఎఫెక్ట్.. విద్యా సంస్థలకు వారం రోజులు సెలవు ప్రకటించిన మమతా బెనర్జీ!
West Bengal: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యాసంస్థలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.
Heat wave effect on Schools: ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా.. విద్యాసంస్థలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 22 వరకు మూసివేయబడతాయి. గత కొన్ని రోజులుగా పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తలనొప్పి మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆమె కోరారు.
ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. డార్జిలింగ్ మరియు కాలింపాంగ్ జిల్లాల్లోని కొండ ప్రాంతాలు మినహా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థలకూ సోమవారం నుంచి శనివారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు దీదీ తెలిపారు.
Also Read: Miss Femina 2023: ఫెమినా మిస్ ఇండియాగా నందిని గుప్తా, గెలుపుకోసం ఎంత కష్టపడిందో తెలుసా?
మరో వైపు తీవ్రమైన వేడి కారణంగా పాఠశాలలకు వేసవి సెలవులను రీషెడ్యూల్ చేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 24వ తేదీ నుంచి కాకుండా మే 2 నుంచే వేసవి సెలవులు ప్రారంభమవుతాయయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 19 వరకు ఈ వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read: Sabarimala Airport: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి