Heavy Rains: ఉత్తరాధిలో జల విలయం..కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లు..వీడియో వైరల్..!
Heavy Rains: ఉత్తరాధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరద విలయం కొనసాగుతోంది.
Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాలతో నదులన్నీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. కంగ్రా జిల్లాలో వరద ధాటికి రైల్వే వంతెన కూలింది. దీంతో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
చక్కీ నదిపై నిర్మించిన వంతెనలోని ఓ పిల్లర్ ధ్వంసమైంది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు ఫోన్లలో చిత్రీకరించారు. ఇప్పుడా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతకొంతకాలంగా హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. కంగ్రా, కులు, మండి, ధర్మశాల జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ధర్మశాలలో వర్షాలు, ఈదురుగాలులకు కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గుతోంది. మండి జిల్లాలో వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. ఇళ్లు, దుకాణాలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. గల్లంతు అయిన వారంతా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈనెల 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డెహ్రాడూన్‌లో కుండపోత వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. తపకేశ్వర్ గుహాల్లోకి వరద నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. నదులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగ్ నదిపై ఉన్న బ్రిడ్జ్ సైతం వరదలకు కొట్టుకుపోయింది. ముస్సోరిలోని కెంప్టీ జలపాతం ఉప్పొంగుతోంది.
Also read:Mahesh Babu Bare body : మొట్టమొదరిసారిగా షర్ట్ లేకుండా దర్శనమిచ్చిన మహేష్ బాబు
Also read:KCR Munugode Meeting Live Updates: మునుగోడు సభకు బయలుదేరిన కేసీఆర్.. 4 వేల కార్లతో భారీ కాన్వాయ్
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook