KCR Munugode Meeting: ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో..మోదీపై కేసీఆర్ ధ్వజం..!

Munugode Bypoll: మునుగోడు.. మునుగోడు.. తెలంగాణ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణలో  ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 20, 2022, 04:56 PM IST
KCR Munugode Meeting: ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో..మోదీపై కేసీఆర్ ధ్వజం..!
Live Blog

KCR Munugode Meeting: మునుగోడులో ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఏముందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా..ఇప్పుడు బైపోల్ ఎందుకని మండిపడ్డారు. ఎవరి కోసం ఈఉప ఎన్నిక అని అన్నారు. టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇచ్చిందని..మునుగోడు నుంచి ఢిల్లీ దాక కామ్రేడ్లతో ఐక్యత కొనసాగాలన్నారు సీఎం కేసీఆర్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేంద్రమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

20 August, 2022

  • 16:51 PM

    ఈడీకి దొంగలు భయపడతారు..నేను ఎందుకు భయపడతా: కేసీఆర్
    మీరు గోకినా గోకకపోయినా..నేను గోకుతా: కేసీఆర్
    ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో: కేసీఆర్
    బీజేపీ వాళ్లకు ఎందుకంత అహంకారం
    బెంగాల్‌లో మమత సర్కార్‌ను పడగొడతామని అంటున్నారు
     అందరం కలిసి బీజేపీకే మీటర్ పెడదాం
    కాంగ్రెస్‌కు ఓటు వేస్తే..అది వేస్ట్ అయిపోతుంది

     

  • 16:35 PM

    ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరు
    కృష్ణా జలాలపై మీ పాలసీ ఏమిటో అమిత్ షా చెప్పాలి
    మునుగోడులో గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చింది
    ఎవరి కోసం ఈఉప ఎన్నిక
    మునుగోడులో బైపోల్ రావాల్సిన అవసరం ఏముంది
    మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా..ఇప్పుడు బైపోల్ ఎందుకు
    టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇచ్చింది
    మునుగోడు నుంచి ఢిల్లీ దాక కామ్రేడ్లతో ఐక్యత కొనసాగాలి
    కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అమిత్ షా సమాధానం చెప్పాలి

  • 15:45 PM

    మునుగోడు చేరుకున్నారు సీఎం కేసీఆర్

    హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో ఆయన మునుగోడు వెళ్లారు

    ఎల్బీనగర్, చౌటుప్పల్, నారాయణపురం మీదుగా మునుగోడు చేరుకున్నారు కేసీఆర్

  • 14:45 PM

    మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ అధికారింగా ప్రకటించింది సీపీఐ.  బీజేపీని ఓడించే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇస్తున్నామని తెలిపారు. బీజేపీని ఓడించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని చెప్పారు. అందుకే  బీజేపీని ఓడించే పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని.. టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తామని తెలిపారు. మునుగోడు సభలోనూ పాల్గొంటామని చెప్పారు చాడా వెంకట్ రెడ్డి.

  • 14:06 PM

    టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతుపై రేవంత్ రెడ్డి ఫైర్

    కేసీఆర్ కు కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దారుణం- రేవంత్

    ఇన్నాళ్లు పేదల కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు వృథా అయ్యాయి- రేవంత్

    ఉప ఎన్నిక కారణంగా ప్రతినిధులు అమ్ముడుపోయారు- రేవంత్ రెడ్డి

     

  • 13:16 PM

    మునుగోడు బహిరంగ సభకు ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయలు దేరారు

    ఎల్బీనగర్ , చౌటుప్పల్, నార్కట్ పల్లి మీదుగా మునుగోడు వెళ్లనున్నారు కేసీఆర్

    హైదరాబాద్ నుంచి 4 వేల కార్ల కాన్వాయ్ తో వెళ్తున్నారు కేసీఆర్

  • 12:28 PM

    హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీతో మునుగోడు వెళుతున్న టీఆర్ఎస్ నేతలు

    తన కారుపై నిలబడి తీన్మార్ స్టెప్పులు వేసిన మంత్రి మల్లారెడ్డి

    మల్లారెడ్డితో కలిసి డ్యాన్సు చేసిన టీఆర్ఎస్ నేతలు



     

     

  • 11:49 AM

    మునుగోడు పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చర్లగూడెం, కిష్టరాయన్ పల్లి రిజర్వాయర్ల నిర్వాసితులకు ఏడున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చని కేసీఆర్... ఇప్పుడు సిగ్గులేకుండా మునుగోడులో ఓట్ల కోసం వస్తున్నారని మండిపడ్డారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న నిర్వాసితులను కలిసి క్షమాపణ చెప్పి... వాళ్లకు వడ్డీతో సహా పరిహారం ఇచ్చాకే ఓట్లడగాలని అన్నారు.

     

  • 11:40 AM

    మునుగోడులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

    అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి

    బీజేపీ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది- కిషన్ రెడ్డి

    ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు- కిషన్ రెడ్డి

     

  • 11:02 AM

    మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి

    పొర్లగడ్డ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

    టీఆర్ఎస్, బీజేపీ పై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

    చర్లగూడెం భూ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

     

  • 10:20 AM

    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో కాంగ్రెస్ జండాను ఎగారావేసిన రేవంత్ రెడ్డి

  • 10:07 AM

    కేసీఆర్ పర్యటనతో పలు మార్గాల్లో ట్రాఫిక్ అంక్షలు

    మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు పలు మార్గాల్లో దారి మళ్లింపు

    విజయవాడ జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ ఆంక్షలు

    రామన్న పేట. చిట్యాల మీదుగా వాహనాల దారి మళ్లింపు

     

  • 09:20 AM

    మునుగోడు ఉప ఎన్నికలో కీలక పరిణామం

    అధికార టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు

    నిన్న సీపీఐ నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు

    మునుగోడు సభకు హాజరుకానున్న సీపీఐ నేతలు

     

  • 09:01 AM

    ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.

    ఉదయం 11 గంటలకు మునుగోడుకు రానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

    మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించనున్న

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • 08:43 AM

    ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన.

    రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.

    పోర్లుగడ్డ తండాలో పాదయాత్ర చేయనున్న రేవంత్ రెడ్డి

    మన మునుగోడు మన కాంగ్రెస్ ను కాపాడుకుందాం నినాదంతో పాదయాత్ర

    నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో  కాంగ్రెస్ ఇంచార్జులు, ముఖ్య నేతల పాదయాత్ర

  • 08:14 AM

    సీఎం కేసీఆర్ మునుగోడు సభతో నియోజకవర్గంలో పోలీసుల ముందస్తు అరెస్టులు

    పోలీసుల అదుపులో చర్లగూడెం, కిష్టరాంపల్లి భూనిర్వాసితులు

    భూపరిహారం పెంచాలంటూ కొన్ని రోజులుగా నిర్వాసితుల ఆందోళన

    సీఎం సభలో నిరసన చెబుతారనే అనుమానంతో ముందస్తు అరెస్ట్

  • 08:11 AM

    హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 12:30కు రోడ్డు మార్గంలో మునుగోడుకు సీఎం కేసీఆర్

    నాలుగువేల కార్ల భారీ కాన్వాయ్ తో మునుగోడుకు సీఎం కేసీఆర్

    మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయరహదారి పై ట్రాఫిక్ ఆంక్షలు

    విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా ట్రాఫిక్ మళ్లింపు

    మునుగోడులో సాయంత్రం 4గంటలకు సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్

    ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50 మంది సీఐలు,

    94 మంది ఎస్సైలు మొత్తం 2 వేల మంది పోలీసులతో కేసీఆర్ బహిరంగ సభకు బందోబస్తు

Trending News