Sukanya Samruddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన లో తక్కువ పెట్టుబడి తో కూడా మీకు ఎంత రాబడి లభిస్తుందో తెలుసా?
Government Schemes : మీ కుమార్తె భవిష్యత్తు గురించి చింతిస్తున్నరా? ఆమె కు 21 ఏళ్లు వచ్చే సమయానికి మంచి మొత్తంలో డబ్బు ఆమెకు అందజేయాలి అనుకుంటున్నారా. అయితే సుకన్య సమృద్ధి యోజన గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కేవలం నెలకు రూ. 1000, 2000, 3000 లేదా 5000 పెట్టుబడులతో మంచి మొత్తం లో రాబడిని అందుకోవచ్చు. దాని గురించిన వివరాలు తెలుసుకోండి.
Sukanya Samruddhi Yojana : మీకు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తె ఉందా? ఆమె కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే సుకన్య సమృద్ధి యోజన అనే ఒక ప్రభుత్వ పథకం సిద్ధం గా ఉంది. ఇందులో భాగంగా మీరు పెట్టిన పెట్టుబడి కి ఏకంగా 7.6 శాతం వడ్డీని అందుకోవచ్చు. ప్రతి ఏడాది కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ పథకంలో మీరు పాల్గొనవచ్చు. పథకం లో చేరి పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టినప్పటి నుండి పథకం ముగిసే దాకా అంటే 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం సిద్ధం అవుతుంది. మీరు మీ కుమార్తె కోసం ఎంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయడం మొదలు పెడితే, అంత త్వరగానే మెచ్యూరిటీ మొత్తాన్ని కూడా మీరు అందుకోవచ్చు.
ఒకవేళ కుమార్తె పుట్టినప్పటి నుండే మీరు ఈ పథకం లో పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే ఆమె కు 21 ఏళ్లు వచ్చే సమయానికి మీరు ఆమెకు ఇవ్వడం కోసం మంచి మొత్తంలో మెచ్యూరిటీ అమౌంట్ సిద్ధంగా ఉంటుంది. ఈ పథకం లో మీరు నెల కు 1000, 2000, 3000, 4000 లేదా 5000 పెట్టుబడులు పెట్టచ్చు. మనం పెట్టే పెట్టుబడి మొత్తానికి అందుకునే వడ్డీ లాభం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకంలో భాగం గా నెలకు రూ.1000 పెట్టుబడి చేస్తే, ఏడాదికి మీరు రూ.12 వేలు డిపాజిట్ చేసినట్టు అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన (SSY) కాలిక్యులేటర్ ప్రకారం 15 సంవత్సరాలలో మీరు పెట్టే మొత్తం పెట్టుబడి రూ. 1,80,000 కాగా రూ. 3,29,212 వడ్డీ నుండి మాత్రమే అందుతుంది. ఈ విధంగా మీకు మెచ్యూరిటీ సమయం లో మొత్తంగా రూ. 5,09,212 అందుతాయి.
మీరు నెలకు రూ. 2,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఏడాదికి రూ.24,000 డిపాజిట్ అవుతాయి. అయితే పెట్టుబడి రూ.3,60,000 కాగా వడ్డీ ఆదాయం రూ.6,58,425 వస్తుంది. మెచ్యూరిటీపై మీరు రూ. 10,18,425 అందుకోవచ్చు.
నెలకు రూ.3000 పెట్టుబడి గా లెక్కిస్తే ఏడాదికి రూ.36,000 అవుతుంది. మొత్తం పెట్టుబడి రూ.5,40,000 కాగా వడ్డీ మొత్తం రూ.9,87,637 కూడా చేరి మెచ్యూరిటీపై మొత్తం రూ.15,27,637 అందుతాయి.
నెలకు మీరు 4000 పెట్టుబడి పెడుతూ వస్తే, ద్వారా, ఏటా రూ. 48,000 డిపాజిట్ అవుతుంది. 15 ఏళ్లలో మీరు పెట్టే మొత్తం 7,20,000 పెట్టుబడి కి రూ.13,16,850 వడ్డీ కూడా కలిసి మెచ్యూరిటీ సమయం లో రూ.20,36,850 అందుకోవచ్చు.
మీరు సుకన్య సమృద్ధి యోజన లో నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే ఏటా రూ.60,000 జమ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా, 15 సంవత్సరాలలో మీరు పెట్టే రూ.9,00,000 పెట్టుబడి మీద రూ.16,46,062 వడ్డీ కూడా చేరి మెచ్యూరిటీ సమయానికి మీ కుమార్తె కోసం మీ దగ్గర రూ.25,46,062 ఫండ్ సిద్ధంగా ఉంటుంది.
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook