JEE Mains 2021: జేఈఈ మెయిన్స్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, ఏ దశ పరీక్షలు ఎప్పుడు..
JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ 2021కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొచ్చిన పలు మార్పులతో పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నాలుగు దశల్లో జేఈఈ పరీక్షలు జరగనున్నాయి.
JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ 2021కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొచ్చిన పలు మార్పులతో పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నాలుగు దశల్లో జేఈఈ పరీక్షలు జరగనున్నాయి.
దేశంలోని నాలుగు ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( IIT ) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( IIIT ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ( IISER ) వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జేఈఈ తప్పనిసరి. అయితే జేఈఈ 2021 ( JEE 2021 ) విభిన్నంగా ఉండబోతోంది. నాలుగు దశల్లో పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం ఉండనుంది. కరోనా నేపధ్యంలో ఈసారి ఎక్కువ మంది విద్యార్ధులకు అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( National Testing Agency ) ..జేఈఈలో పలు మార్పులు తీసుకొచ్చింది. దాంతో ఈసారి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. జేఈఈ 2021కు 21 లక్షల 75 వేల 183 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ ( JEE Mains 2021 ) పరీక్షలు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున జరగనున్నాయి. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఉదయం , సాయంత్రం రెండు సెషన్లలో ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో పరీక్ష ఉండనుంది. ఇప్పటివరకూ నమోదైన 21 లక్షల 75 వేల దరఖాస్తుల్లో పది స్థానిక భాషల్లో రాసేందుకు 10 లక్షల మంది ఆప్షన్ ఇచ్చుకున్నారు. ఇతర భాషల్లో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చుకున్న అభ్యర్ధులు వేలల్లో ఉంటే..తెలుగులోనే అత్యల్పంగా కేవలం 371 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు.
ఫిబ్రవరిలో జరగనున్న తొలిదశ జేఈఈ పరీక్ష ( JEE Examination ) కు 6 లక్షల 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో 23 నుంచి 26వ తేదీ వరకూ పరీక్షలు జరగనుండగా..మార్చ్ నెలలో 15 నుంచి 18 వరకూ జరుగుతాయి. అటు ఏప్రిల్ నెలలో 27 నుంచి 30 వరకూ జరగనుండగా..మేలో 24 నుంచి 28 వరకూ నిర్వహిస్తారు.
Also read: EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook