EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన

 EPFO Relief For Employers:  దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు.  పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 5, 2021, 05:33 PM IST
  • దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు EPFO ఖాతాలు
  • లాక్‌డౌన్ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను జమ చేయడంలో ఆలస్యం
  • దీనిపై జరిమానా విధించకూడదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయం
EPF Deposit: 6.5 లక్షల Employersకి భారీ ఊరట కల్గించిన EPFO, పెనాల్టీపై కీలక ప్రకటన

EPFO Relief For Employers: దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ (EPF) బకాయిలను జమ చేయడంలో ఆలస్యం అయింది. కానీ పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుక్రవారం అధికారిక రంగ సంస్థలకు ఉపశమనం కలిగించింది. 

కోవిడ్-19 సమస్యల్ని పరిష్కరించడానికిగానూ లాక్‌డౌన్ సమయంలో పీఎఫ్ ఖాతాదారులకు నగదు జమచేయని సంస్థలు, కార్యాలయాలకు జరిమానా విధించడం లేదని స్పష్టం చేశారు. కరోనా కారణంగా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వాటికి ఎలాంటి జరిమానా విధించరాదని (EPFO Latest Updates) నిర్ణయించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 

Also Read: EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి

 

కార్మిక శాఖ తాజాగా నిర్ణయంతో 650,000 సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ సంస్థలు తమ ఉద్యోగుల పీఎఫ్ నగదు(PF Balance) చెల్లించలేదని గుర్తించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ఉదయం పిహెచ్‌డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో జరిగిన ఈపీఎఫ్ఓ సీఈఓ సునీల్ బార్త్‌వాల్ స్పందించారు. 

Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే

 

త్వరలో ఈపీఎఫ్ వాటా 24 శాతం బదులు 20 శాతం మాత్రమే అవుతుందని చెప్పారు. కార్మికులకు ఈపీఎఫ్ కంట్రిబూషన్ తగ్గడం వల్ల కలిగే లాభాలను సైతం తమ ఉద్యోగులకు కంపెనీలు వివరించాల్సి ఉంటున్నారు. 2 శాతం మేర ఉద్యోగి, సంస్థల వాటా తగ్గడంతో మొత్తం కంట్రిబూషన్ 4 శాతం తగ్గనుందని చెప్పారు. 

Also Read: EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాదారులకు 5 బెనిఫిట్స్.. మీరూ ఓ లుక్కేయండి

 

ఇప్పటివరకూ 12 శాతం యజమాని వాటాగా, 12 శాతం ఉద్యోగి వాటాగా ఈపీఎఫ్ ఖాతాలకు జమ అవుతుంది. వచ్చే మే నెల నుంచి ఇది 10 శాతంగా మారనుంది. త్వరలోనే దీనిపై కేంద్ర కార్మిక శాఖ, EPFO నిర్ణయం తీసుకోనున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News