24 గంటల్లో 7 వేల 964 కొత్త కేసులు..!!
భారత దేశంలో `కరోనా వైరస్` శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు నమోదవుతున్న తీరు చూస్తే... ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు, వలస కార్మికుల తరలింపు, విదేశాల నుంచి వస్తున్న భారతీయులు, స్వదేశీ విమానయానం పునరుద్ధరణ, రైల్వే సర్వీసుల పునః ప్రారంభం తర్వాత రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
భారత దేశంలో 'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు నమోదవుతున్న తీరు చూస్తే... ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు, వలస కార్మికుల తరలింపు, విదేశాల నుంచి వస్తున్న భారతీయులు, స్వదేశీ విమానయానం పునరుద్ధరణ, రైల్వే సర్వీసుల పునః ప్రారంభం తర్వాత రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
నిన్న ఒక్కరోజే 7 వేల 964 కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు నిన్న ఒక్క రోజే 265 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 4 వేల 971కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు లక్షా 73 వేల 763 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 86 వేల 422 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. అంతే కాదు ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడ్డ 82 వేల 370 మందికి చికిత్స చేసి సురక్షితంగా ఇంటికి పంపించినట్లు వెల్లడించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..