Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గానూ మూడు రోజల పాటు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో ఇవాళ పలు స్కూళ్లలో హిజాబ్​ మద్దతుదారులు, వ్యతిరేకించే వారి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ప్రభుత్వం సెలవుల నిర్ణయం తీసుకుంది.


స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.


'విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ప్రజలు అందరూ కర్ణాటకలో శాంతి, సామరస్యాలను కాపాడాలి. వచ్చే మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. అందరూ సహకరకించాలని కోరుతున్నా' అని ట్వీట్ చేశారు బొమ్మై.



అసలు ఏమిటి ఈ హిజాబ్ వివాదం..


కర్ణాటకలో కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లు, కాలేజీలకు వస్తున్నారు. అయితే యూనిఫాం నిబంధనలకు విరుద్ధం అంటూ.. గత నెల నుంచి విద్యా సంస్థల్లో ఈ విషయంపై వివాదం సాగుతోంది.


ఓ విద్యా సంస్థలో హిజాబ్ ధరించిన వారిని క్లాస్​​ రూంలోకి అనుమతించకూండా.. వేరే రూంలో కూర్చోబెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి.


ఇక తాజాగా కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు కాషాయం కండువా కప్పుకుని రావడం.. హిజాబ్​ ధరించిన వాళ్లకు, కాషాయం కండువా కప్పుకున్న వారికి మధ్య గొడవలు జరగటం వంటి ఘటనలు వెలుగు చూశాయి.


ఈ అంశం స్కూళ్లూ, కాలేజీలు దాటి విద్యా శాఖ, కర్ణాటక రాజకీయాలకు పాకింది. దీనితో ఈ వివాదం కోర్టుకెక్కింది.


ఇవాళ ఈ విషయంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు. తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రాష్ట్రానికి మంచిది కాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


రేపు కూడా ఈ అంశంపై కోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది.


Also read: Digital beggar: మెడలో క్యూఆర్​ కోడ్​తో భిక్షాటన- ప్రధాని మోదీనే ఆదర్శమట!


Also read: JNU News VC: మరోసారి తెలుగు వ్యక్తికి అవకాశం... జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook