Digital beggar: మెడలో క్యూఆర్​ కోడ్​తో భిక్షాటన- ప్రధాని మోదీనే ఆదర్శమట!

Digital beggar: అన్నీ డిజిటల్​ రూపం దాల్చుతున్నాయి. తాజాగా భిక్షాటనలో కూడా ఓ వ్యక్తి డిజిటల్​ పద్ధతిని ప్రారంభించాడు.  ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 05:31 PM IST
  • భిక్షాటనను డిజిటల్​ రూపంలోకి మార్చిన బిహార్​ వ్యక్తి
  • ధానం చేసే వారికి క్యూఆర్ కోట్ స్కానింగ్ ఆప్షన్​
  • ప్రధాని మోదీనే ఆదర్శమని వెల్లడి
Digital beggar: మెడలో క్యూఆర్​ కోడ్​తో భిక్షాటన- ప్రధాని మోదీనే ఆదర్శమట!

Digital beggar: ఇప్పుడంతా డిజిటల్​ యుగం నడుస్తోంది. చాలా వరకు పనులు డిజిటల్​ రూపంలోనే నడుస్తున్నాయి. ఇక పేమెంట్స్​ విషయంలో అయితే డిజిటలీకరణ ఏ స్థాయిలో పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద షాపింగ్​ మాల్స్ నుంచి.. రోడ్డు పక్కల బండిపై పండ్లు, పూలు అమ్ముకునే వారి వరకు.. అందరూ డిజిటల్ పేమెంట్స్​ తీసుకుంటున్నారు.

డిజిటల్ పేమెంట్స్ ఎక్కడైనా ఆమోదిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ వెంట డబ్బులు తీసుకెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. మరి అవసరమైతే తప్ప డబ్బులు వెంట తీసుకెళ్లడం లేదు.

దీనితో భిక్షాటన చేసే వాళ్లు ఎవరైనా డబ్బు అడిగితే.. చిల్లర లేదు అని చెప్పడం సర్వ సాధారణం ఆయిపోయింది. అయితే ఈ పరిస్థిని అర్థం చేసుకున్న ఓ వ్యక్తి 'డిజిటల్ భిక్షాటన' ప్రారంభించాడు. మెడలో యూపీఐ క్యూఆర్ కోడ్​ తగిలించుకుని.. స్కాన్​ చేయమని అడగటం ప్రారంభించాడు.

ఇదంతా ఎక్కడ జరిగిందంటే..

బిహార్​లోని బెట్టియా​ రైల్వై స్టేషన్​లో 40 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి.. రోజు అక్కడే ఉంటూ భిక్షాటన చేసుకుంటున్నాడు.

డబ్పులు (క్యాష్​ రూపంలో) లేవని చెప్పిన వారికి.. డిజిటల్​గా పేమెంట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాడు.ఇందుకోసం ఓ క్యూఆర్ కోడ్​ను మెడలో వేసుకుని.. ఓ ట్యాబ్లెట్​ను కూడా వెంట పెట్టుకున్నాడు.

రాజు పటేల్​ను చూసిన వాళ్లలో.. భిక్షాటనకు కూడా క్యూఆర్​ కోడ్ వాడుతున్నారా అని చాలా మంది షాక్ అవుతున్నారు. కొంత మంది క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేసి డబ్బులు కూడా ట్రాన్స్​ఫర్ చేస్తున్నారు.

అందుకే రూటు మార్చా..

ఇక ఈ విషయంపై రాజు పటేల్​ ఏమన్నాటంటే.. కావాల్సినంత డబ్బు వస్తే కడుపు నింపుకుంటానని చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి తాను ఇదే పని చేస్తున్నట్లు తెలిపాడు. అయితే మారుతున్న కాలంతో తాను కూడా భిక్షాటన పద్దతిని మార్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

చాలా మంది నగదు రూపంలోనే ఇస్తారని.. కొంత మంది స్కాన్ చేసి కూడా డబ్బులు ఇస్తారని చెప్పాడు రాజు పటేల్​.

ప్రధాని మోదీనే తనకు ఆదర్శం..

ఇదంతా ఒక ఎత్తైతే అతడు చెప్పిన కొన్ని విషయాలు వింటే షాక్​ అవ్వక తప్పదు. తాను.. బిహార్​ మాజీ సీఎం లాలూ ప్రసాద్​ యాదవ్​ ఫాలోవర్​ను అని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ప్రచారం తనకు ఆదర్శమని వెల్లడించాడు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని 'మన్​ కి బాత్' రేడీయో కార్యక్రమాన్ని వింటానని అన్నాడు.

ఇక బ్యాంక్ ఖాతా కోసం తాను పాన్ కార్డు కూడా తీసుకున్నట్లు చెప్పాడు రాజు పటేల్​. పాన్​, ఆధార్​ తీసుకుకెళ్లి బెట్టియాలోని ఎస్​బీఐ మెయిన్ బ్రాంచ్​లో ఖాతా తెరిచినట్లు వెల్లడించారు.

Also read: Police Beaten Journalist: మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ జర్నలిస్టుపై పోలీసుల అరాచకం!

Also read: JNU News VC: మరోసారి తెలుగు వ్యక్తికి అవకాశం... జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News