ఎట్టకేలకు హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ హాయిగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటలకు వరకు సాగడం గమనార్హం. 68 నియోజకవర్గాలలో దాదాపు 337 అభ్యర్థులు పోటీలో నిలవగా, 74 శాతం  ఓటింగ్ జరిగినట్లు అధికారిక అంచనా. ఎప్పటిలాగే ఈ సారి కూడా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఎక్కువగా 68 శాతం ఓటింగ్ నమోదైంది. తొలిసారిగా ఓటు రసీదు యంత్రాలను అనగా వీవీ ప్యాట్‌లను ఈ ఎన్నికలలో వినియోగించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ సారి హిమాచల్ ప్రదేశ్‌లోని తమ నియోజకవర్గాలకు వచ్చి ఓటు వేశారు. దాదాపు 40 వేల మంది పోలీసు యంత్రాంగం ఈ ఎన్నికలకు రక్షణ, భద్రతా బాధ్యతలను చేపట్టారు. డిసెంబరు 18, 2017న ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. 100 ఏళ్లు దాటి కూడా ఓటు వేయడానికి వచ్చిన సీనియర్ సిటిజన్ శ్యామ్ శరణ్ నేగి ఈ ఎన్నికలలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కల్పి నియోజక వర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 120 సంవత్సరాలు దాటిని మరో సూపర్ సీనియర్ సిటిజన్ చూరీదేవి మండీ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING