Vaccine Slot Booking: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను రోజురోజుకూ మరింత సులభతరం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిన్ యాప్, వెబ్ పోర్టల్‌లకు ప్రత్యామ్నాయంగా మరో సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వ్యాక్సినేషన్(Corona vaccination) ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో తెచ్చేందుకు, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా వాట్సప్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్(Cowin App) లేదా కోవిన్ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్‌పార్టీ యాప్‌లు అంతకంటే అవసరం లేదు. కేవలం మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సహాయంంతో మీరు నిత్యం ఉపయోగించే వాట్సప్ ఆధారంతో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ కరోనా హెల్ప్‌డెస్క్ ఈ ఏడాది మార్చ్‌లో ప్రారంభం కాగా..వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ ఈ నెల నుంచి మొదలైంది. హెల్ప్‌డెస్క్ నుంచి 31 లక్షలమంది వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సప్ నుంచే అత్యదికంగా డౌన్‌లోడ్ చేసుకన్న గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్(Whatsapp Vaccine Slot Booking) అవకాశాన్ని కూడా కల్పించింది. 


ముందుగా మీ మొబైల్‌లో 9013151515 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత బుక్ స్లాట్ అని ఇంగ్లీషులో టైప్ చేసి మెస్సేజ్ పంపాలి. మీకు ఆరంకెల ఓటీపీ నెంబర్ మొబైల్‌కు వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్‌కు ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ప్రకారం వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడిచ్చారు, రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలనే వివరాలుంటాయి. హెల్ప్‌డెస్క్ మెనూలో కుటుంబసభ్యుల్లో ఎవరి పేర్లైనా చేర్చాలా , సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ వివరాలు వంటి ఆప్షన్లకు 1,2,3 ఇలా 8 వరకూ నంబర్ ఆప్షన్లు ఉంటాయి. మన అవసరానికి తగిన నెంబర్ రిప్లై ఇస్తే అందుకు అనుగుణంగా మళ్లీ ఆప్షన్లు వస్తాయి.  ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్(Vaccine Slot Booking) చేసుకోవడంతో పాటు ఇతరత్రా సమాచారం కూడా తెలుసుకోవచ్చు. 


Also read: Vaccine Efficacy: కరోనా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేయడం లేదంటున్న కన్సార్టియం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook