ఈపీఎఫ్ సభ్యులకు కీలక సూచన, ఈ నామినేషన్ దాఖలు చేయకపోతే డబ్బులు పోయినట్టే
PF E Nomination: పీఎఫ్ ఎక్కౌంట్‌కు సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే నామినీకు అందాల్సిన డబ్బులు అందవంటోంది. అసలు ఈ నామినేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలో తెలుసుకుందాం.
PF E Nomination: పీఎఫ్ ఎక్కౌంట్‌కు సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే నామినీకు అందాల్సిన డబ్బులు అందవంటోంది. అసలు ఈ నామినేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ(EPFO) కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఈపీఓఫ్ఓలో సభ్యులు ఈ నామినేషన్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంది. సభ్యుడు మరణిస్తే ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రయోజనాల్ని సులభంగా పొందేందుకు వీలుగా ఈ నామినేషన్(E Nomination) దాఖలు చేయాల్సి ఉంటుందని ఈపీఎఫ్ఓ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. సభ్యుల సౌకర్యార్ధం ఈ నామినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ సేవల్ని ప్రారంభమయ్యాయి. ఈ నామినేషన్ చేస్తే సభ్యుడు మరణిస్తే..ఈడీఎల్ఐ కింద 7 లక్షల రూపాయలు నామినీకు అందుతాయి. ఈ నామినేషన్ నిమిత్తం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఆన్‌లైన్‌లో ఆ వెసులుబాటు ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఈ నామినేషన్ దాఖలు చేయకపోతే..ఇలా చేయండి.
ముందుగా ఈపీఎఫ్ అధికారిక లింక్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పై క్లిక్ చేయండి. తరువాత యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి. మీరు ఇంకా ఈ నామినేషన్ (How to file E nomination)దాఖలు చేయకపోయుంటే..మీకు పాప్‌అప్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ఎంచుకోండి. తరువాత ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కోసం ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది కుటుంబసభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతాల వివరాల్ని సమర్పించవచ్చు. దీనికోసం నామినేషన్ వివరాలపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్‌పై క్లిక్ చేసి..ఓటీపీ జనరేట్ చేయడం కోసం ఈ సైన్‌పై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీను సబ్మిట్ చేస్తే..ఈ నామినేషన్ రిజిస్టర్ అయినట్టే.
Also read: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook