Aadhaar-Epfo link: మీ పీఎఫ్ అక్కౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేశారా లేదా..లేకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే గడువు తేదీ సమీపిస్తోంది. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా ఆధార్ లింక్ చేయాల్సిందే మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు కల్పిస్తూనే నిబంధనల్ని కూడా మారుస్తోంది. ఇప్పుడు ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం మీ పీఎఫ్ అక్కౌంట్‌తో ఆధార్‌ను లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఖాతాదారుల సౌలభ్యం కోసం గతంలో జూన్ 1 వరకూ ఉన్న గడువు తేదీను మరోసారి పెంచింది. ఇప్పుడు సెప్టెంబర్ 1లోగా ఆధార్ నెంబర్‌తో పీఎఫ్ అక్కౌంట్‌ను లింక్ చేసుకోవాలి. ఈపీఎఫ్ కొత్త నిబంధనల(Epf new rules)ప్రకారం ఇది తప్పనిసరి. లేకపోతే మీ పీఎఫ్ అక్కౌంట్‌లోని నగదుపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీరు ఆధార్‌తో లింక్ చేయకపోతే సదరు కంపెనీ నుంచి జమ చేసే నగదగు మీ ఖాతాలో రాదు. అందుకే వెంటనే మీ ఆధార్‌ను జమ చేసుకోండి. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఈపీఎఫ్ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికోసం మీరేమీ పెద్గగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. 


ఈపీఎఫ్ - ఆధార్ లింక్(Epf-Aadhaar link)ఎలా చేసుకోవాలంటే..


ముందుగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవండి. తరువాత మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఆధార్ అని ఉన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి. మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్‌ను సరిగ్గా నమోదు చేసిన సేవ్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ఆధార్ (Aadhaar)నెంబర్‌ యూఐడీఏఐ(UIDAI) డేటా బేస్‌తో వెరిఫై అవుతుంది. అంతే ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది. 


Also read: Taj Mahal night viewing in moonlight: తాజ్ మహల్ నైట్ వ్యూయింగ్ డేట్స్, టైమింగ్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook