ఆధార్ కార్డు ( Aadhaar Card ) వర్షంలో పడి తడిసిపోవడం మనకు తెలిసిందే. దానికోసం మనందరం దాన్ని కలర్ జిరాక్స్ చేయించి ఒరిజినల్ ఇంట్లో పెట్టి జిరాక్స్ కాపీని ల్యామినేట్ చేయిస్తాం. దాంతో పాటు కొంద మంది కార్డును మడతపెట్టి పర్సులో తీసుకెళ్తారు. దీని వల్ల కార్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| How To Download Arogya Setu: ఆరోగ్య సేతు యాప్ ఎలా డౌన్ లోడ్ చేయాలి ? ఆపరేటింగ్ ఎలా?


కానీ ఇకపై ఆధార్ కార్డు భద్రత విషయంలో మనం అంత టెన్షన్ పడే  అవసరం లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు కూడా హైటెక్ అవుతోంది. UIDAI ఆధార్ కొత్త రూపాన్ని పరిచయం చేసింది. ఇది మన ఏటీఎం కార్డులాగే ఉంటుంది.



ఆధార్ కార్డు కొత్త ఫార్మెట్...
UIDAI ఒక ట్వీట్ చేసి ఆధార్ కార్డు రూపురేఖల్ని మార్చినట్టు తెలిపింది. దాన్ని PVC కార్డులా ప్రింట్ తీసుకోవచ్చు అని తెలిపింది. ఈ కార్డును పర్సులో ఏటీఎం కార్డులా అట్టేపెట్టేయవచ్చు. మీకు అనుకూలంగా ఉండే సైజులో ఉన్న ఈ కార్డును మీరు కేవలం రూ.50కే సొంతం చేసుకోవచ్చు అని తెలిపింది.


కొత్త ఆధార్ కార్డు ఎలా ఉంటుంది ?
What's New in Aadhaar Card?
ఎండా, వానా, చలి, దుమ్ము, ధూళి వంటి వివిధ పరిస్థితులను తట్టుకునే విధంగా ఈ కొత్త కార్డు ఉంటుంది. ఇకపై మీకార్డు వర్షంలో తడిసి పాడైపోతుంది అనే టెన్షన్ అవసరం లేదు. ఈ కార్డు చూడటానికి అందంగా కనిపించడమే కాదు ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో. వీటిలో హోలోగ్రామ్, మైక్రోటెక్ట్స్ వంటి ఫీచర్లున్నాయి. దీనిని UIDAI పోర్టల్ నుంచి ఆర్డర్ చేయవచ్చు.



ALSO READ| How To Download Arogya Setu: ఆరోగ్య సేతు యాప్ ఎలా డౌన్ లోడ్ చేయాలి ? ఆపరేటింగ్ ఎలా?


కొత్త పీవిసి కార్డును సొంతం చేసుకునే విధానం.
How to Make New Aadhaar PVC Card
1. ముందుగా మీరు UADAI పోర్టల్ https://uidai.gov.in/ను విజిట్ చేయండి.


2. తరువాత మై ఆధార్ అనే సెక్షన్ పై క్లిక్ చేసి ఆర్డర్ ఆధార్ పీవీసి కార్డును ఎంచుకోండి.


3. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి


4. క్యాప్చా ఫిల్ చేయండి. ఓటీపి ఎంటర్ చేయండి.


5. మీ ఆధార్ కార్డు పీవీసి ప్రివ్యూ మీ ముందు ప్రత్యక్షం అవుతుంది.


6. రూ. 50 చెల్లించండి.


7. పేమెంట్ అయ్యాక ప్రాసెస్ పూర్తి అవుతుంది. మీ కార్డు స్పీడ్ పోస్ట్ లో మీ ఇంటికి చేరుతుంది.


అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR