Whatsapp Tricks: క్వాలిటీ పోకుండా వాట్సప్‌తో ఫోటోలు పంపించడం ఎలా
Whatsapp Tricks: వాట్సప్. ప్రముఖ మెస్సేజింగ్ యాప్. ఫోటోలు పంపించుకునేందుకు ఓ అద్బుత సాధనం. అయితే ఆ వాట్సప్ ద్వారా పంపించినప్పుడు ఫోటోల క్వాలిటీ పడిపోతుంటుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Whatsapp Tricks: వాట్సప్. ప్రముఖ మెస్సేజింగ్ యాప్. ఫోటోలు పంపించుకునేందుకు ఓ అద్బుత సాధనం. అయితే ఆ వాట్సప్ ద్వారా పంపించినప్పుడు ఫోటోల క్వాలిటీ పడిపోతుంటుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సప్ ప్రముఖ మెస్సేజింగ్ యాప్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచంలోని నలుమూలల్నించి ప్రజలు వాట్సప్ ద్వారానే మెస్సేజెస్, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, విషెస్ పంపించుకుంటుంటారు. వివిధ రకాల ఈమోజీలు, స్టిక్కర్ల ద్వారా బంధుమిత్రుల పట్ల మీకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే చాలా సందర్భాల్లో వాట్సప్ ద్వారా మీరు పంపించే పోటోలు కంప్రెస్ అయిపోతుంటాయి. అంటే ఫైల్ వేగంగా వెళ్లేందుకు 70 శాతం క్వాలిటీకు పడిపోతుంది. వాట్సప్ ద్వారా ఫోటోలు పంపించేటప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే. ఫోటోల క్వాలిటీ పడిపోతుంటుంది. ఒరిజినల్ క్వాలిటీతో ఫోటో పంపించడం సాధ్యం కానే కాదు.
అయితే వాట్సప్ ద్వారా ఒరిజినల్ క్వాలిటీతో ఫోటోలు పంపించడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. కొన్ని ట్రిక్స్ అవలంభిస్తే ఒరిజినల్ క్వాలిటీతోనే ఫోటోలు పంపించుకోవచ్చు.
ముందుగా వాట్సప్ (Whatsapp) ఎక్కౌంట్ ఓపెన్ చేయండి. ఎవరికి ఫోటో పంపించాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ ఓపెన్ చేయండి. తరువాత చాట్ స్క్రీన్ దిగువన పేపర్ క్లిప్ వంటి ఐకాన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. చాలా ఐకాన్స్ లిస్ట్ కన్పిస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పంపించాలనుకున్న ఫోటోను డాక్యుమెంట్ ద్వారా పంపించండి. ఒకవేళ ఫోటో కన్పించకపోతే బ్రౌజ్ అదర్ డాక్స్ క్లిక్ చేయండి. అప్పుడు ట్యాప్ చేయండి. కావల్సిన ఫోటోను ఎంచుకుని పంపించండి. ఈ విధానంలో పంపిస్తే..ఫోటో క్వాలిటీ (Quality)దెబ్బతినకుండా ఉంటుంది.
Also read: Samantha Post: మహిళను లైంగికంగా వేధించవద్దని అబ్బాయిలకు నేర్పమంటున్న సమంతా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి