Electricity Bill: ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది.. షాక్‌తో ఆ వ్యక్తి ఆసుపత్రిపాలు...
Huge Electricity Bill Shocks Madhya Pradesh Man: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి షాక్ తిన్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యాడు. ఎందుకిలా జరిగిందంటే...
Huge Electricity Bill Shocks Madhya Pradesh Man: ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్లు చూసిన ఓ వ్యక్తికి గుండె ఆగినంత పనైపోయింది. ఆ బిల్లు చూడగానే షాక్‌కి గురైన అతను తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిసిటీ సిబ్బంది తప్పిదం తన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చిందని బాధితుడి తండ్రి వాపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన సంజీవ్ కంకణే ఇంటికి ఇటీవల ఎలక్ట్రిసిటీ సిబ్బంది నెల వారీ బిల్లు జారీ చేశారు. ఆ స్లిప్పును కంకణే భార్యకు అందజేశారు. అందులో ఎలక్ట్రిసిటీ బిల్లు రూ.3419 కోట్లు అని ఉండటంతో ఆమె షాక్‌కి గురయ్యారు. ఇంతలో ఆమె మామ వచ్చి ఆ బిల్లును చూశాడు. స్లిప్పుపై ఆ బిల్లును చూసి షాక్ తిన్న అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఎలక్ట్రిసిటీ సిబ్బంది నిర్వాకం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్లిప్పులో రూ.3419 కోట్లు బిల్లు చూపించడంపై సంజీవ్ కంకణే ఎలక్ట్రిసీటీ అధికారులను ఆరా తీశారు. సిబ్బంది తప్పిదం వల్లే బిల్లు తప్పుగా ప్రింట్ అయిందని అధికారులు చెప్పారు. బిల్లు ప్రింట్ చేసే సమయంలో రూ.1300కి బదులు కన్స్యూమర్ నంబర్ ఎంటర్ చేయడంతో ఈ పొరపాటు జరిగిందన్నారు. పొరపాటును సరిచేసి కొత్త బిల్లు స్లిప్పును జారీ చేసినట్లు వెల్లడించారు. దీనికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు ఉంటాయని మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న్ సింగ్ తోమర్ కూడా ఒక ప్రకటనలో వెల్లడించారు.
Also Read: Horoscope Today July 27th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి...
Also Read: Komatireddy Rajagopal Reddy: బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్...?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.