Humanity at its worst: కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి..ఆపై..
Humanity at its worst: మనుషులు మానవత్వం మరచిపోతున్నారు. కనీచ విచక్షణ మరిచి మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. కొందరు వ్యక్తులు మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించి..వాటిని హతమారుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. వానరాలకు విషం పెట్టి...గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 20కిపైగా కోతులు మరణించాయి.
Humanity at its worst: నోరులేని మూగజీవాలని తెలిసి కూడా మనుషులు దారుణాలకు పాల్పడుతున్నారు. తమ జాతి వైరాన్ని సైతం మరచి..తోటి జంతువులకు ఆ నోరులేని ప్రాణులు సాయం చేస్తున్నాయి. చదువు ఉండి, మంచి-చెడుల విచక్షణ అన్నీ తెలిసిన మనిషి మానవత్వాన్ని(Humanity) మరచి మృగాళ్ల ప్రవర్తిస్తున్నాడు. తాజాగా కర్ణాటక(Karnatka)లోని కోలార్(Kolar) వద్ద అటవీ రహదారి సమీపంలో గోని సంచుల్లో మరణించిన కోతులు(Monkeys) కనిపించాయి. ఈ మరణించిన 20కి పైగా కోతులు ఉండవచ్చునని.. వీటిని విషయం పెట్టి చంపేశారని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కోతులకు పోస్ట్ మార్టం నిర్వహించింది. నిందితులను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
గుర్తు తెలియని దుండగులు(unknown persons) కోతులను గొనె సంచిలో చౌడేనహళ్లి సమీపంలో రోడ్డు పక్కన పడేశారు. రోడ్డు పక్కన పడి ఉన్న ఈ సంచులను గుర్తించిన స్థానిక యువకులు వాటిని తెరిచి చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బ్యాగులు తెరిచినప్పుడు…కొన్ని కదలలేని స్థితిలో ఉన్నాయి.. అయితే అవి కోన ఊపిరితో ఉన్నట్లు యువకులు చెప్పారు. ఇక ఇదే విషయంపై కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) విచారణ చేపట్టింది. జిల్లా పరిపాలన, అటవీ శాఖ ,జంతు సంక్షేమ బోర్డు అధికారులను ప్రతివాదులుగా కేసు దాఖలు చేయబడింది.
Also read:Breaking news: అర్ధరాత్రి పోసాని ఇంటిపై రాళ్లదాడి
ఇదే తరహా సంఘటన.. ఈ సంవత్సరం జూలైలో హసన్ జిల్లా(Hassan district)లోని బేలూరు తాలూకా చౌదనహళ్లి( Chowdenahalli) గ్రామంలో చోటు చేసుకుంది. అప్పడు కూడా కనీసం 30 కోతులు చనిపోయాయి. అంతేకాదు 20 కోతులు గాయపడ్డాయి. అప్పుడు కూడా కోతులకు విషయం ఇచ్చి అనంతరం వాటికి కొట్టినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక 2020 నవంబరులో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో కూడా దాదాపు 50 కోతులు విషమిచ్చి చంపబడ్డాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook