'కరోనా వైరస్'.. శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్.. అతి కొద్దికాలంలోనే ప్రపంచ దేశాల్లో భీభత్సాన్ని సృష్టించింది. కరోనా మహమ్మారికి చికిత్స చేసేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ వారికి కూడా ముప్పు తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే కొంత  మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కరోనా మహమ్మారికి బలయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాణాలు  ఫణంగా వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. అలాంటి వారికి ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువ. కాబట్టి .. ఇప్పుడు కరోనా వైద్య చికిత్సలో రోబోల వాడకం మొదలైంది. హ్యూమానాయిడ్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి. అంటే  మానవరూపంలో ఉండే ఈ రోబోలు.. వైద్య చికిత్సతోపాటు కరోనా పాజిటివ్ రోగులకు ఆహారం అందించడం, ఆస్పత్రి పారిశుద్ధ్యం నిర్వహించడం లాంటి కార్యకలాపాల్లో సహకరిస్తాయి.


మిలాగ్రో హ్యూమన్ టెక్నాలజీ సంస్థ.. ఈ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసింది. వీటిని ప్రత్యేకంగా కరోనా పాజిటివ్ రోగుల వార్డుల్లో పని చేసేందుకు రూపొందించారు. కరోనా వైరస్ ఉద్దృతి ప్రారంభం కాగానే వీటి తయారీకి రంగం సిద్ధం చేసినట్లు మిలాగ్రో సంస్థ తెలిపింది. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న 30  శాతం మందికి ఇన్ఫెక్షన్ సోకిందన్న వార్త .. తమను ఆలోచింపజేసిందని పేర్కొంది. 


ఈ హ్యూమానాయిడ్ రోబోలలో వైద్యులకు ఉపయోగకరంగా ఉండే నాలుగు రకాల అంశాలను ఇన్ స్టాల్ చేశారు.  వైద్యులు టెలీ కన్సల్టేషన్  చేసే విధంగా రోబోలు పని చేస్తాయి. ఈ రోబోలను ముట్టుకుని కమాండ్ ఇవ్వాల్సిన  అవసరం లేదు. ఇందులో వాయిస్ ఆధారితంగా తనను నియంత్రించే వ్యక్తిని రోబో గుర్తిస్తుంది. ఒకవేళ వైద్యులు అందుబాటులో లేకున్నా ఇప్పటికే ఇన్ స్టాల్ చేసిన ప్రీ టెంప్లేట్లతో ఎవరైనా రోబోను నియంత్రించే అవకాశం ఉండడం మరో విశేషం.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..