Hyderabad police filed case against central home minister amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తెలంగాణ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి.  ఈక్రమంలో దీనిపై ఈసీ సీరియస్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తెలంగాణలో పర్యటించారు.  ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో కోడ్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ కు చెందిన నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి, అమిత్ షా చిన్నారులతో కూడా ఎన్నికల ప్రచారం చేయించారంటూ నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీనిపై స్పందించిన ఈసీ వెంటనే కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 1 వ తేదీన అమిత్ షా.. బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగ లాల్ దర్వాజ నుంచి సుధా టాకీస్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సభలో.. నిబంధలనలకు విరుద్ధంగా రోడ్ షోలో చిన్నారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, స్థానిక నేతలు యమన్ సింగ్ పై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.  ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి పలువురు కాంగ్రెస్ కు చెందిన సోషల్ మీడియాను హ్యాండీల్ చేసే వారికి నోటీసులు ఇచ్చారు.


అంతేకాకుండా.. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు హైదరబాద్ లో మకాం వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఘటనపై సీఎంకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన లీగర్ సెల్ ద్వారా ప్రత్యేంగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నేపథ్యంలో విచారణకు హజరు కాలేనంటూ తన లాయర్.. సౌమ్యా గుప్తా ద్వారా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. 


బీజేపీని అన్ని విధాలుగా గట్టిగా ఎదురు దాడి చేస్తున్నానని, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించినందుకు తనపై , గాంధీభవన్ నేతలపై ఢిల్లీ పోలీసులను పంపి నోటీసులు ఇప్పించారన్నారు. ఒకప్పుడు.. బీజేపీ ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను పంపేదని ఇప్పుడు బీజేపీ ట్రెండ్ మార్చిందని సెటైర్ వేశారు. ఈసారి ఢిల్లీ పోలీసులను ముందుగా మోదీ టీమ్ రంగంలోకి దింపిందని అన్నారు. కాంగ్రెస్ తన లీగల్ సెల్ ను ఢిల్లీకి పంపించారు.అంతేకాకుండా.. సీఎం రేవంత్ ఒక స్టార్ క్యాంపెయినర్ వల్ల అనేక బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల హోమంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ఒక ఫెక్ వీడియో సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, అన్ని కాంగ్రెస్ పార్టీల హ్యాండీల్స్ లలో వైరల్ గా మారింది. దీనిపై కేంద్రం హోంశాఖ సీరియస్ గా స్పందించిన విషయం తెలిసిందే.


 


Read more: Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


Read more:Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter