‘I am the biggest environmentalist, but…’: Union Minister Nitin Gadkari defends Goa infra projects : గోవాలో ఇటీవల ప్రతిపాదించిన ఆయా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై పర్యావరణవేత్తల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే లైన్ డబ్లింగ్‌, గోవా-హుబ్లీ(Goa-Hubli) జాతీయ రహదారిని (highway) ఫోర్ లైన్స్ గా (four lanes) విస్తరించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. అలాగే కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితర ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెట్లను నరికివేయాల్సి వస్తుంది. అలాగే వందల హెక్టార్ల భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. అయితే ఇలా చేయాల్సి రావడంతో పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.


Also Read : Huzurabad By Election Result Live Counting: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం


ప్రజలకు ఉపాధి అందించి, పేదరికం నుంచి బయటపడేసే ఆర్థికాభివృద్ధిని సాధించే క్రమంలో.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వ్యతిరేకత అంశం అడ్డుగా వస్తోందని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. అయితే తాను అందరికంటే పెద్ద పర్యావరణవేత్తను అని గడ్కరీ అన్నారు. అయితే పుస్తకాలు మాత్రం రాయను అని గడ్కరీ అన్నారు. తనకు జలసంరక్షణకు పాటుపడే ఒక ఎన్‌జీవో (NGO) ఉందని.. అది అవార్డూ గెలుచుకుందంటూ చెప్పుకొచ్చారు. అలాగే భారత్‌లో ఇథనాల్, మిథనాల్, (Methanol) బయోడీజిల్, బయో సీఎన్‌జీ తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రవేశపెట్టాను గడ్కరీ చెప్పారు.


అయితే పర్యావరణాన్ని పరిరక్షించాలి కానీ అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమైనదే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్థికాభివృద్ధితో ప్రజలకు ఉపాధి దొరుకుతుందని.. తద్వారా పేదరికం నిర్మూలన సాధ్యపడుతుందని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు.


Also Read : Shyam Singha Roy promo: శ్యామ్ సింగ రాయ్ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook