మధ్యప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరుగుతోంది. భౌతికదూరం, మాస్కు ధరించడం లాంటివి వైద్యులతో పాటు అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సార్ మీరు ఎందుకు మాస్క్ ధరించలేదని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘నేను ఏ కార్యక్రమంలోనూ మాస్క్ ధరించను. అసలు మాస్క్ ధరించడమే తనకు ఇష్టం ఉండదంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించనని మీడియా వారికే గట్టిగా చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. దీంతో తాను చేసిన తప్పిదం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు అర్థమైంది. దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడు. మాస్క్ ధరించడం తనకు ఇష్టమేనని, అయితే కేవలం అనారోగ్య కారణాలతో మాస్క్ ధరించడం లేదని వివరణ ఇచ్చుకునే యత్నం చేశారు. తాను ఇకనుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్న మాస్క్ ధరిస్తానని మధ్యప్రదేశ్ హోం మంత్రి చెప్పారు.




 


కాగా, ఇండోర్‌లో బుధవారం జరిగిన సంబాల్ యోజన పంపిణీ కార్యక్రమంతో పాటు ఇండోర్ పోలీసు సిబ్బందికి సన్మానం కార్యక్రమాలో పాల్గొన్నారు. మాస్కు ఎందుకు ధరించడం లేదని ప్రశ్నించగా.. నేను ఏ కార్యక్రమంలోనూ మాస్క్ ధరించలేదు. అయినా ఏమవుతుందని నిర్లక్ష్యంగా మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు. సామాన్యులకే కోవిడ్19 నిబంధనలు, మంత్రులకు రూల్స్ వర్తించవా అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుంటూ.. ఇకపై మాస్కు ధరిస్తానని పేర్కొన్నారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe