Railway Jobs 2022: గుడ్ న్యూస్: రైల్వేలో 876 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... అప్లై చేసుకోండి ఇలా..!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో 876 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడం ఎలాగంటే..
How to Apply for ICF Recruitment 2022: పదోతరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లోని 876 అప్రెంటీస్ పోస్టులను (Integral Coach Factory Recruitment 2022) భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం pb.icf.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అప్రెంటీస్ (ఫ్రెషర్) పోస్టులు-276
కార్పెంటర్-37 ఎలక్ట్రీషియన్- 32, ఫిట్టర్- 65, మెషినిస్ట్- 34, పెయింటర్- 33, వెల్డర్- 75
అప్రెంటీస్ (Ex ITI) పోస్టులు-600
కార్పెంటర్- 50, ఎలక్ట్రీషియన్ -156, ఫిట్టర్- 143, మెషినిస్ట్ -29, పెయింటర్ -50, వెల్డర్ -170, డైస్- 2
ఎడ్యుకేషన్: పదో తరగతి పాసై ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.
వయస్సు: 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
>> ముందుగా మీరు ICF అధికారిక వెబ్‌సైట్ pb.icf.gov.in లోకి వెళ్లండి.
>> తర్వాత హోమ్ పేజీలోనే కెరీర్ అప్షన్ ను ఎంచుకోండి. అనంతరం దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
>> ఇందులో మీ వ్యక్తిగత, ఎడ్యుకేషన్ వివరాలను నింపండి.
>> అనంతరం ఆ డాక్యుమెంట్స్ ను అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయండి.
>> చివరగా మీ దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Also Read: Destination Alert: డెస్టినేషన్ అలర్ట్.. ఇక రైల్వే ప్రయాణికులకు ఆ టెన్షన్ అక్కర్లేదు...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook