IDBI Bank SO Recruitment 2020: కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నిరుద్యోగులకు, కొత్త జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైతం శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది ఐడీబీఐ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల(Jobs 2020)ను భర్తీ చేయనున్నారు. మార్కెటింగ్‌, ఏటీఎం, ట్రేడ్ ఫైనాన్స్‌, ట్రెజ‌ర‌ర్, సెక్యూరిటీ, డేటా అన‌లిటిక్స్ త‌దిత‌ర విభాగాలలో స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. 


Also Read: Intelligence Bureau Recruitment 2020: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 ఉద్యోగాలు, అర్హత, పూర్తి వివరాలు



మొత్తం పోస్టులు 134
డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్-డి) - 11 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్-సి) - 52 పోస్టులు
మేనేజర్(గ్రేడ్-బి) - 62 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఎ) - 9 పోస్టులు



ఐడీబీఐ బాంకు ఉద్యోగాల (Bank Jobs)ను  బట్టి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ & టెలీక‌మ్యూనికేష‌న్స్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ లేదా ఎంసీఏ లాంటి విద్యార్హత కలిగి ఉండాలి. మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు సైతం ఎంబీఏ, పీజీడీడీఎం, ఏజీఎం చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అనుభవం, ఇతరత్రా వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లోకి చూసుకోవాలి. 


Also Read: AP Jobs 2020: నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త!



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
ఎంపిక: దరఖాస్తులలోని అర్హతలు, అనుభవం ఆధారంగా ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఆపై షార్ట్ లిస్ట్ అయిన వారిక గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
ఫీజు: జనరల్, ఈబీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 24, 2020
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 7, 2021
అధికారిక వెబ్‌సైట్‌: https://www.idbibank.in/ 


Also Read: Telangana Jobs 2020: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook