If you finish Baahubali thali in 40 minutes, win Rs 8 lakhs prize money: నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాను దాదాపుగా మనందరం చూసే ఉంటాం. ఆ సినిమాలో స్టార్ కమెడియన్ ధనరాజ్ (Dhanraj) చేసిన అల్లరి అంతాఇంతా కాదు. ముఖ్యంగా హోటల్‌లో ధనరాజ్ చేసిన ఛాలెంజ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. హోటల్‌లో పందెం కాసి.. ఏకంగా ఒక్కడే 50 పరోటాలు తిని ఛాలెంజ్ గెలుస్తాడు. అచ్చు అలాంటి ఘటనే రియల్ లైఫ్లో జరిగింది. ఓ ఇద్దరు యువకులు 'బాహుబలి థాలీ' తిని ఏకంగా రూ 8 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూ ఢిల్లీ (New Delhi)లోని కన్నాట్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్ (Ardor 2.1 Restaurant) ఓ ఫుడ్ ఛాలెంజ్ (Food Challenge) నిర్వహించింది. భారీ ఐటమ్స్ ఉన్న ఓ థాలీని కేవలం 40 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. నిర్ణీత సమయంలో బాహుబలి థాలీని తింటే.. రూ 8 లక్షల ప్రైజ్ మనీని ఇస్తామని ఆర్డోర్ 2.1 రెస్టారెంట్ ప్రకటించింది. ఇది చూసిన రజనీష్ జ్ఞాని (Rajneesh Gyani) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి ఛాలెంజ్‌ను పూర్తిచేశాడు. ఇద్దరు కలిసి ఆ థాలీని 39 నిమిషాల 52 సెకండ్లలో పూర్తిచేశారు. దాంతో వారు సంబరాలు చేసుకున్నారు. ఎగిరి గంతులు వేస్తూ పెద్దగా కేకలు వేశారు. 


Also Read: Virat Kohli Test Records: ఏ భారత కెప్టెన్‌లకు అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ.. తిరుగులేని టెస్ట్ రికార్డులు ఇవే!!


ఆర్డోర్ 2.1 రెస్టారెంట్ ఫుడ్ ఛాలెంజ్ గెలవడంతో రజనీష్ జ్ఞాని రూ 8 లక్షల ప్రైజ్ మనీ (Rs 8 lakhs Prize Money) గెలుచుకున్నాడు. ప్రైజ్ మనీ రూ. 8 లక్షలతో వారు తమ విజయాన్ని సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ప్రైజ్ మనీని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తామని చెప్పారు. ఇందుకు సంబందించిన 15 నిమిషాల నిడివి గల క్లిప్‌.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 



బాహుబలి థాలీ (Baahubali Thali)లో అనేక ఉత్తర భారతీయ వంటకాలు ఉన్నాయి. తమతర్ కా షోర్బా, పాప్డీ చాట్, గోభీ మటర్, దాల్ తడ్కా, కధీ పకోడా, ఆలూ పాలక్, మలై కోఫ్తా, సోయా చాప్ మసాలా, కధాయ్ పనీర్, దాల్ మఖానీ, దమ్ ఆలూ, సాగ్ మరియు పనీర్ టిక్కా మసాలా, వెజ్ బిర్యానీ, స్టీమ్డ్ రైస్ మరియు రకాల రొట్టెలు థాలీలో ఉన్నాయి. పాపడ్‌లు, సలాడ్‌లు, రైతా, ఉల్లిపాయలు, జల్జీరా, రోజ్ షర్బత్‌, గులాబ్ జామూన్‌ కూడా బాహుబలి థాలీలో ఉన్నాయి. 


Also Read: Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook