IIT JEE Advanced 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంత్ ఇటీవల ప్రకటించారు. జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి తాజాగా తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది 11 ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ తేదీల వివరాలను జనవరి 7వ తేదీన లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రకటించనున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 నుంచి 26 తేదీలలో 2021లో తొలి విడత జేఈఈ మెయిన్(JEE Main 2021) పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ 2020లో అర్హత సాధించి అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు సైతం శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నేరుగా హాజరు కావొచ్చునని తీపికబురు అందించారు.


Also Read: CBSE Board Exams 2021 Dates: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించిన మంత్రి 



కాగా, సీబీఎస్ఈ(CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 10, 12వ తరగతి విద్యార్థులకు మే 4వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల షెడ్యూల్‌తో పాటు ఫలితాల తేదీలపై సైతం మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కాస్త స్పష్టత ఇచ్చారు. జులై 15లోగా ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడంచారు.


Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook