JEE Advanced 2020 score: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షలతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇంటర్మిడియెట్ బోర్డు పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోయింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులకు మార్కులు వేసి పాస్ చేసినందున ఈసారి విద్యార్థులకు టాప్ 20 పర్సంటైల్‌లో ( Top 20 percentile ) చోటు దక్కించుకునే అవకాశాలు కూడా అంతే తక్కువ ఉన్నాయి. దీంతో ఐఐటీ అడ్మిషన్స్‌ విషయంలో జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు ( JAB ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. ఐఐటిలో ప్రవేశాలకు రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ బోర్డు నిర్వహించే పరీక్షల్లో 75 శాతం మార్కులు లేదా టాప్‌ 20 పర్సంటైల్‌‌లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను తొలగిస్తూ జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన స్టూడెంట్స్‌కి అందులో వచ్చిన మార్క్స్‌తో సంబంధం లేకుండా ఐఐటి ప్రవేశాలకు అర్హత సాధించినట్టేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్ ( HRD Minister Ramesh Pokhriyal Nishank ) ప్రకటించారు. ట్విటర్ ద్వారా ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ( Also read: Gold masks, silver masks: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులకు పెరిగిన డిమాండ్.. ధర ఎంతో తెలుసా ? )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"187866","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని జాయింట్ అడ్మిషన్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఈసారి ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి పాసైన విద్యార్థులు అందరికీ ఐఐటీల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధించినట్టయింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌- 2020లో అర్హత సాధించిన విద్యార్థులు అందరికీ ఈసారి అదే స్కోర్ ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఐఐటి ఆశావహులకు ( IIT aspirants ) ఒక రకంగా టాప్ 20 పర్సంటైల్‌తో వచ్చే అడ్డంకులు తొలగిపోయాయి. ( Also read: Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే )