Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్‌కు బలైన వైద్యుల సంఖ్య 624
Corona Second Wave: కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతోంది. వైరస్ దెబ్బకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి వైద్యులే హరీమంటున్న పరిస్థితి. సెకండ్ వేవ్‌కు బలైన వైద్యులు దేశంలో..
Corona Second Wave: కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతోంది. వైరస్ దెబ్బకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి వైద్యులే హరీమంటున్న పరిస్థితి. సెకండ్ వేవ్‌కు బలైన వైద్యులు దేశంలో..
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) అత్యంత ప్రాణాంతకంగా మారింది. అత్యంత వేగంగా సంక్రమించడమే కాదు..లెక్కలేనన్ని ప్రాణాల్ని బలితీసుకుంది. మరణ మృదంగం మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1 లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 21 లక్షల 59 వేల 873 కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు. నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా 2 వేల 887మంది మరణించారు.
కరోనా సెకండ్ వేవ్ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. జూన్ 2 అంటే నిన్నటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఏకంగా 624 మంది వైద్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇందులో ఏపీ నుంచి 34 మంది, తెలంగాణ నుంచి 32 మంది డాక్టర్లున్నారు. ఢిల్లీలో అత్యధికంగా 109 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోగా..యూపీలో 79, బీహార్ లో 96, రాజస్థాన్ లో 43 మంది మరణించారు. అటు మొదటి వేవ్‌లో 748 మంది వైద్యులు మృతి చెందారు.
Also read: Serum Institute: కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యాక్సిన్ విధానంపై సీరమ్ కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook